నేను అనేక రకాల చేపల పులుసులు అందుబాటులోకి తెచ్చాను. ఒకసారి తిన్న వాళ్ళు బాగుందని పది మందికి చెబుతున్నారు. నా కిచెన్ ఎలా ఉంటుందో, అక్కడ చేపల పులుసు ఎంత శుభ్రంగా, క్వాలిటీగా తయారు చేస్తారో నేను చూపించాను. చేపల పులుసు రుచిగా లేకపోతే ఎవరూ కొనరు. నెగిటివ్ ప్రచారం చేసి నా వ్యాపారం కూలదోయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు.వారు ఎంతగా తప్పుడు ప్రచారం చేస్తే నాకు అంత మంచింది. ఆ విధంగా నా వ్యాపారానికి ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందని, కిరాక్ ఆర్పీ వెల్లడించారు.