స్విమ్మింగ్ పూల్ లో ప్రణీతా జలకాలాట.. తడి అందాలతో మైమరిపిస్తున్న బుట్టబొమ్మ.. ఆ క్రెడిట్ ఆయనదేనంట?

First Published | Feb 8, 2023, 5:18 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఫొటోషూట్లు, వీడియోలతో ఆకట్టుకుంటున్నారు.  
 

‘బావ’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ప్రణీతా సుభాష్. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ వచ్చింది. 
 

మరోవైపు అటు కన్నడ, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటూ వచ్చారు ప్రణీత. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే 2021లో తన ప్రియుడు నితిన్ రాజ్ తో పెళ్లి పీటలు కూడా ఎక్కింది. రీసెంట్ గా పండంటి బిడ్డకూ జన్మనిచ్చింది. 
 


అప్పటి నుంచి సినిమాల జోరు తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం భర్త, కూతురితో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ప్రణీత. ఈక్రమంలో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ప్రణీత పంచుకున్న ఓ వీడియో వైరల్ గా మారుతోంది.
 

స్మిమ్మింగ్ లో పూల్ జలకాళుడుతూ ఓ వీడియోను ప్రణీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ స్మిమ్ సూట్ లో నీళ్లలో మరింతగా మెరిసిపోతోంది. ఈ సందర్భంగా తన భర్త వీడియో తీస్తుండగా.. ప్రణీత క్యూట్ గా పోజులిచ్చినట్టు తెలిపింది. ఇందులో సగం వీడియో తీసిన క్రెడిట్ తన భర్తదేనంటూ క్యాప్షన్ లో తెలిపింది. ఇక తడి అందాలతో పూల్ లో ప్రణీత రచ్చకు అభిమానులు, నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
 

ప్రణీత నటించిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, రామ్ పోతినేని సరసన ‘హాలో గురు ప్రేమకోసమే’, ‘రభస’,‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల్లో ప్రణీత నటకు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. 
 

పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించింది. మలయాళంలో తొలిసినిమా చేయబోతోంది. మలయాళం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. ‘రమణ అవతార’ అనే మరో చిత్రంలోనూ ప్రణీత నటిస్తున్నారు.  
 

Latest Videos

click me!