నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ, ఐతే ఏందీ? నీ పతనం మొదలవుతుంది... ఈ రేంజ్ వార్నింగా?

Published : Jun 10, 2024, 01:55 PM IST

ఒక మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ హీరో అల్లు అర్జున్ కి నేరుగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. అయితే ఏంటీ? నేను ఎవడికీ భయపడను. నీ పతనం మొదలైందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.   

PREV
17
నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ, ఐతే ఏందీ? నీ పతనం మొదలవుతుంది... ఈ రేంజ్ వార్నింగా?

ఒక మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ హీరో అల్లు అర్జున్ కి నేరుగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. అయితే ఏంటీ? నేను ఎవడికీ భయపడను. నీ పతనం మొదలైందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. 
 

27

అల్లు అర్జున్ సైతం తన మద్దతు పవన్ కళ్యాణ్ కి ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరాలని కామెంట్ చేశాడు. అయితే ఎన్నికల ప్రచారం ముగింపు రోజు వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు తెలియజేశాడు. రవి ఎప్పుడూ నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడతాడని, అందుకే మద్దతు తెలిపానని మీడియా ముందు వివరణ ఇచ్చారు. 
 

37
Nagababu, allu arjun


ఇది కూటమి నేతలకు నచ్చలేదు. పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ఇకపై మావాడు కాదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వివాదం రేపగా డిలీట్ చేసిన నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలు ఎదుర్కొన్నారు. 

47
Kiraak RP

వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం నచ్చలేదని కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్ పై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆయనపై దాడి చేసింది. ఆయన వ్యాపార సముదాయాల మీద దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకంగా అల్లు అర్జున్ కి కిరాక్ ఆర్పీ వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేశాడు.

57
Allu Arjun

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా దాడులకు తెగబడుతున్నారు. అలా చేసిన ప్రభుత్వం కూలిపోయింది. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నీకు పతనం మొదలైంది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. నేను ఎవడికీ భయపడను. 
 

67
Kiraak RP

నీకు ఆర్మీ ఉందో లేదో నాకు తెలియదు. ఆర్మీ అంటే నీది కాదు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిజమైన ఆర్మీ. నువ్వు హీరోగా ఎదుగు సంతోషిస్తాము. అంతే కానీ ఇలాంటి చర్యలు మానుకో అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కిరాక్ ఆర్పీ ఇంతటి సాహసం చేయడం వెనుక నాగబాబు ఉన్నాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

77
allu arjun

అల్లు అర్జున్ పై నాగబాబు ఆగ్రహంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మీద  ఆయన విమర్శలు చేస్తే కుటుంబం పరువు బజారున పడినట్లు అవుతుంది. అందుకే తన వీరాభిమాని అయిన కిరాక్ ఆర్పీతో ఈ తరహా మాటల దాడి చేయిస్తున్నాడనిపిస్తుంది. లేదంటే కిరాక్ ఆర్పీకి అంత ధైర్యం లేదని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి... 

Read more Photos on
click me!

Recommended Stories