మోక్షజ్ఞ కంటే ముందే కూతురు తేజస్వినిని పరిచయం చేసిన బాలకృష్ణ.. బోయపాటితో సినిమా ప్రకటన..

Published : Jun 10, 2024, 10:08 AM IST

బాలకృష్ణ తన కొడుకుని ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ముందుగా కూతురు తేజస్వినిని పరిచయం చేశాడు.   

PREV
17
మోక్షజ్ఞ కంటే ముందే కూతురు తేజస్వినిని పరిచయం చేసిన బాలకృష్ణ.. బోయపాటితో సినిమా ప్రకటన..

నందమూరి బాలకృష్ణ తన నట వారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయంచేయాలని చాలా రోజులుగా ప్లాన్‌ చేస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా దీనికి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం సత్యానంద్‌ వద్ద మోక్షజ్ఞ యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడట. ఇటీవల విశ్వక్‌ సేన్‌ కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. 
 

27

ఈ లెక్కన ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉండదని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇక బాలయ్య రూట్‌ మార్చాడు. కొత్త గేమ్‌ షురూ చేశాడు. కొడుకు బదులు కూతురుని పరిచయం చేశాడు. తన రెండో కూతురు తేజస్విని ఇండస్ట్రీకి పరిచయం చేయడం విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. 

37

బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నేడు(జూన్‌ 10)ని పురస్కరించుకుని ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని పేరు వేయడం విశేషం. తేజస్విని పేరు ప్రజెంటర్‌(సమర్పకులు) గా వేశారు. దీంతో నిర్మాణ రంగంలోకి కూతురుని దించుతున్నాడు బాలయ్య. ఈ లెక్కన కొడుకు కంటే ముందే కూతురుని ఇండస్ట్రీలోకి దించడం విశేషం. 
 

47

నిజానికి తేజస్విని చాలా రోజులుగా సినిమాలకు సంబంధించిన యాక్టివ్‌గా ఉంటుంది. తెరవెనుక బాలయ్యని లీడ్‌ చేస్తుంది. ఎలాంటి కథలు ఎంచుకోవాలనే అంశాలతోపాటు ఆయన లుక్‌, కాస్ట్యూమ్స్, షో విషయంలోనూ ఆమె తెరవెనుక ఉండి నడిపించింది. బాలయ్య చేసిన `అన్‌ స్టాపబుల్‌` షో తెరవెనుక కథ నడిచింది తేజస్వినినే, ఆయన లుక్‌నుంచి అన్ని తానే దగ్గరుండి చూసుకుంది. అందుకే ఇటీవల బాలయ్య లుక్‌కి మంచి పేరొచ్చింది. అంతేకాదు ఎలా ఉండాలనేది కూడా ఆమె గైడ్‌ చేస్తుందట. అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌ కావడంలో ఆమె పాత్ర చాలా ఉందని తెలుస్తుంది. 
 

57
Tejaswini Nandamuri

దీంతోపాటు గత మూడు నాలుగేళ్లుగా బాలకృష్ణ చేస్తున్న సినిమాల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఎంచుకునే కథలతోపాటు, డైరెక్టర్స్ విషయంలో మార్పు ఉంది. బోయపాటి శ్రీను తప్పితే బాలయ్య చాలా వరకు యంగ్‌ డైరెక్టర్స్ తో పనిచేస్తున్నాడు. గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడి, ఇప్పుడు చేస్తున్న బాబీ ఇలా అంతా యంగ్‌ డైరెక్టర్స్. దీంతో కథలు కూడా కొత్తగా ఉండటమే కాదు, తన ఏజ్‌కి తగ్గ పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు బాలయ్య. ఇలా బాలయ్య సక్సెస్‌ వెనుక తేజస్విని కీ రోల్‌ ప్లే చేస్తుంది. 

67

కూతురులో ఉన్న ఆ ఆసక్తిని గమనించిన బాలయ్య.. ఆమెని మరింత పుష్‌ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నాడు. నిర్మాతగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బోయపాటితో చేయబోతున్న `బీబీ4` చిత్రానికి తేజస్విని ని సమర్పకులుగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో, భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. 
 

77

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` చిత్రాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్య, బోయపాటి కాంబో సంచలన కాంబినేషన్‌గా నిలిచింది. ఈ క్రమంలో డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం ఇప్పుడు నాల్గో సారి ఈ ఇద్దరు కలుస్తున్న నేపథ్యంలో ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories