ఎన్ని వివాదాలు వెంటాడినా ఎదురొడ్డి నిలబడ్డ `లెజెండ్‌`.. బాలయ్య బర్త్ డే స్పెషల్‌

Published : Jun 10, 2024, 11:28 AM ISTUpdated : Jun 15, 2024, 10:10 PM IST

బాలకృష్ణ గొప్ప నటులలో ఒకరు అందులో సందేహం లేదు. స్క్రీన్ పై హీరోయిజం పండించే బాలయ్య...  ఆఫ్ స్క్రీన్ లో మాత్రం పలు ఆరోపణలు ఆయన్ని వెంటాడాయి. కానీ వాటిని ఎదుర్కొని `లెజెండ్‌`లా నిలబడ్డాడు బాలయ్య.

PREV
110
ఎన్ని వివాదాలు వెంటాడినా ఎదురొడ్డి నిలబడ్డ `లెజెండ్‌`.. బాలయ్య బర్త్ డే స్పెషల్‌
Balakrishna

బాలకృష్ణ స్టార్ హీరోగా అశేష అభిమానుల్ని కలిగి ఉన్నాడు. లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నందమూరి నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌తో రాణిస్తున్నారు. ఇటీవల సినిమాల పరంగా వరుసగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్‌ కొట్టారు. హిందూపూర్‌ నుంచి మూడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. సినిమా అభిమానుల మనసులనే కాదు, జనం మనసులను గెలుచుకుని  నిజమైన `లెజెండ్‌` అనిపించుకుంటున్నారు. 

210
Balakrishna

బాలకృష్ణ ఎంతటి స్టార్‌ డమ్‌ వచ్చినా, టాలీవుడ్‌ టాప్‌హీరోగా రాణిస్తున్నా, అద్భుతమైన నటనతో విశ్వరూపం చూపిస్తున్నా ఆయన్ని కొన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఫ్యాన్స్ ని కొట్టడం, అనుచిత వ్యాఖ్యలు, నిర్మాతపై కాల్పులు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి. 2004 జూన్ 3వ తేదీన తన నివాసంలో  నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ పై కాల్పుల ఘటన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆ కేసు వీగిపోయింది.  

310
Balakrishna

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయంగా విఫలమైన చిరంజీవి మీద బాలకృష్ణ అనుచిత కామెంట్స్ చేశారు. చిరంజీవి, అమితాబ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, అని ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇవి చిరంజీవి ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. కొన్నాళ్లపాటు రచ్చ జరిగింది. ఆ తర్వాత అంతా కూల్‌ అయిపోయారు.

410
Radhika Apte

నటి రాధిక ఆప్టే బాలకృష్ణ కు జంటగా `లెజెండ్`, `లయన్` చిత్రాలు చేసింది.  ఓ సందర్భంలో రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నేను వచ్చిన రెండు గంటలకు ఆ హీరో తాపీగా వచ్చేవాడు. సౌత్ లో లింగ వివక్ష ఉంది. ఒకరోజు నాకు ఒంట్లో బాగోక పడుకున్నాను. ఆ హీరో వచ్చి నా కాళ్లకు చక్కిలిగింతలు పెడుతున్నాడు. నేను ఆయన మీద అందరి ముందు కోప్పడ్డాను. ఇది ఆయన ఊహించలేదని ఆరోపించింది రాధికా ఆప్టే.   అయితే ఆ హీరో బాలయ్యే అని అంతా అనుకున్నారు.  

510
Balakrishna

నటి విచిత్ర సైతం  పరోక్షంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2001లో విడుదలైన `భలేవాడివి బాసూ` షూటింగ్ కేరళలో జరుగుతుండగా ఓ పేరున్న నటుడు తన రూమ్ కి రమ్మన్నాడట. వెళ్లలేదని రోజూ రాత్రి తాగి వచ్చి హోటల్ గది తలుపులు బాదేవాడట. హోటల్ మేనేజర్ సహాయంతో నేను తప్పించుకున్నానని విచిత్ర తమిళ్ బిగ్ బాస్ హౌస్లో అన్నారు.  ఆమె ఆ హీరో పేరు చెప్పలేదుగానీ, అది బాలయ్యే అటు సోషల్‌ మీడియాలో, ఇటు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపించాయి. 

610

2016లో `సావిత్రి` చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ చేసి కామెంట్స్ దుమారం రేపాయి. అమ్మాయి కనపడితే ముద్దైన పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి, అని బాలకృష్ణ వేదిక మీద పబ్లిక్ గా అన్నారు. బాలకృష్ణ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన అన్న మాటల ఉద్దేశ్యం వేరు టీమ్‌ నుంచి వివరణ వచ్చింది.
 

710
Balakrishna

ఓ వేడుకలో మాట్లాడుతూ బాలయ్య అక్కినేని తొక్కినేని అని సంబోధించాడు.  బాలయ్య చేసిన ఈ కామెంట్స్ కి ఏఎన్నార్‌ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ అక్కినేని ఫ్యాన్స్ నిరసలు చేశారు. అది ఫ్లోలో అన్నది, కించ పరచాలనే ఉద్దేశం నాకు లేదని బాలకృష్ణ వివరణ ఇచ్చాడు. అంతేకాదు ఏఎన్నార్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా బాలయ్య పంచుకుని ఏఎన్నార్‌ ఫ్యాన్స్ ని కూల్‌ చేశాడు. 

810
Balakrishna

ఇటీవల జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ అంజలిని బాలయ్య వెనక్కి నెట్టడం వివాదాస్పదం అయ్యింది. జాతీయ స్థాయిలో దీనిపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అంజలి సోషల్ మీడియా వేదికగా బాలయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పందించారు. దీంతో వివాదం క్లోజ్‌ అయ్యింది. 

910

ఇక బాలకృష్ణ సెట్స్ లో అసిస్టెంట్స్ ని కొడతారనే వాదన ఉంది. అంతేకాదు పబ్లిక్‌లో తనని ఇబ్బంది పెట్టిన సందర్బాల్లో చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  కానీ అవన్నీ బాలయ్య ప్రేమ ముందు నిలవలేకపోయాయి. ప్రేమతో కొట్టేవి అని ఆయన టీమ్‌ వెల్లడించింది. బాలకృష్ణ చాలా భోళా మనిషి అని, ఆయన మనసులో ఏమీ ఉండదని, ఏదనిపిస్తే అది చేస్తాడు, తర్వాత వాటి గురించి పట్టించుకోరు, మనసులో పెట్టుకుని కుట్రలు చేసే వ్యక్తి కాదని, ఆయనతో ట్రావెల్‌ చేసిన వాళ్లంతా అనే మాట. అందుకే ఆయన్ని ఎన్ని వివాదాలు వెంటాడినా, ఎంత మంది తొక్కేయాలని చూసినా ఆయన్ని ఏం చేయలేకపోయారు. ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన్ని తొక్కేయలేకపోయాయి. నందమూరి నటసింహం కూడా వాటిని అంతే దీటుగా ఎదుర్కొన్నారు. ఎదురొడ్డి నిలబడ్డారు. అద్భుతమైన సినిమాలతో, అద్భుతమైన యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేశారు, చేస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను మనసులను గెలుచుకున్నారు. 

1010

బాలకృష్ణ నటుడిగానే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా ఆయన తన నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. అలాగే బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్నారు. వ్యక్తిగతంగానూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సినిమాల్లో యంగర్‌ జనరేషన్‌ని ఎంకరేజ్‌ చేస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు. ఇలా కల్మషం లేని మనసుతో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ `లెజెండ్‌` అనిపించుకుంటున్నారు బాలయ్య. మరి ఈ సందర్భంగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలయ్యకి బర్త్ డే విషెస్‌ తెలియజేద్దాం. 

Read more Photos on
click me!

Recommended Stories