`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

Published : May 14, 2024, 05:39 PM IST

జబర్దస్త్ కమెడియన్‌ ఫైమా గురించి మరో షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె ఒక్కరితో కాదు ముగ్గురి జీవితాలతో ఆడుకుందట. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

 జబర్దస్త్ ఫైమా.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కామెడీతో నవ్వులు పూయిస్తుంది. తనదైన స్పెషాలిటీ కామెడీతో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. `పటాస్‌` షో నుంచి కెరీర్‌ ప్రారంభించింది ఫైమా. ఆ షోలో మెప్పించి, నెమ్మదిగా `జబర్దస్త్`లో కామెడీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బోల్డ్ వాయిస్‌తో, మాస్‌ డైలాగ్ లతో ఆకట్టుకుంది. 

26

అయితే జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్‌, క్రేజ్‌తో ఆమెకి బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అందులో తన కామెడీతో అలరించింది. ఆద్యంతం నవ్వులు పూయించింది. షో రక్తికట్టడంలో తనవంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత స్టార్‌ మా వంటి ఇతర షోస్‌లో కొన్ని రోజులు మెరిసింది. 
 

36
Faima Praveen

మళ్లీ ఇప్పుడు జబర్దస్త్ లోకి వచ్చింది. అయితే గతంలో మరో జబర్దస్త్ కమెడియన్‌తో ప్రవీణ్‌తో కలిసి కామెడీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు చెప్పింది ఫైమా. `బిగ్‌ బాస్`‌ షో సమయంలో ఈ విషయాన్ని రివీల్‌ చేసింది. తనకు ఎంతో సపోర్్ట గా ఉన్నాడని పేర్కొంది. 
 

46
Faima Praveen

కట్‌ చేస్తే ఇటీవల ఈ ఇద్దరు విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఫైమా స్పందించింది. తమ జోడీ షోకి మాత్రమే పరిమితమని తెలిపింది. షోలో బాగా క్లిక్ అయిన జంటలను కొనసాగిస్తూ రక్తికట్టిస్తారని, అది నిజం కాదని చెప్పింది. అయితే ప్రవీణ్‌తో తమ రిలేషన్‌ అలాంటిదే అని చెప్పలేదు. కానీ తమ మధ్య కొన్ని సమస్యలున్నాయని, వాటి కారణంగా విడిపోయినట్టు చెప్పింది. తాము మాట్లాడుకోవడం లేదని, ఆ సమస్యలను బయటకు చెప్పలేనని, చెబితే పెద్దవి అవుతుందని చెప్పింది. 

56

ఎలా ఇందులోకి వచ్చారని భాస్కర్ అడగ్గా, రేషన్‌ కోటా లెక్కలు చెప్పి నవ్వించాడు నరేష్‌. ఈ క్రమంలో ఫైమా ప్రస్తావన వచ్చింది. ఆమె ముగ్గురు జీవితాలతో ఆడుకుందని నరేష్‌ కామెంట్‌ చేయడంతో షోలో దద్దరిళ్లింది. ఫైమా సైతం షాక్‌తో కూడా ఎక్స్ ప్రెషన్‌ పెట్టి నవ్వింది. 
 

66
Faima Praveen

అయితే చెబుతున్న లెక్క ప్రకారం ఫైమా ప్రవీణ్‌తోనే ఆడుకుంది. మరి మిగిలిన ఇద్దరెవరు అనేది పెద్ద ప్రశ్న. దీంతో నెటిజన్లు దీనిపై రియాక్ట్ అవుతూ, ఫైమా బయట చేసేపనులు ఇవేనా?, ఆమె ఒక్కరితో కాదా ముగ్గురితో ఆడుకుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ట్విస్ట్ కి వాళ్లంతా షాక్‌ అవుతున్నారు. ఇదంతా కామెడీ యాంగిల్‌లోనే కావడం విశేషం. విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్‌గా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories