OTT: ఈ సినిమా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే చూడండి.. రొమాన్స్‌, ట్విస్టులతో మ‌తిపోవాల్సిందే. ఎక్కడ చూడొచ్చు..

Published : Feb 06, 2026, 10:15 AM IST

OTT: ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఇత‌ర భాష‌ల సినిమాల‌కు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. ఓటీటీలో సంచ‌ల‌నం సృష్టించిన ఇలాంటి ఓ ఇత‌ర భాష సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఓటీటీలో మలయాళ సినిమాల హవా

ఇటీవల ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నవి మలయాళ సినిమాలే. కథ బలం, రియలిస్టిక్ ట్రీట్‌మెంట్, భిన్నమైన కథనంతో ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘చతురం’ కూడా అదే కోవలోకి వస్తుంది. పెద్ద హడావుడి లేకుండా విడుదలైన ఈ సినిమా, మౌత్ టాక్‌తోనే టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

25
కథలోని డార్క్ షేడ్

ఈ కథ కేంద్రంగా ఓ యువతి ఉంటుంది. డబ్బున్న వృద్ధుడిని ఆమె వివాహం చేసుకుంటుంది. ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగదు. భర్త శారీరకంగా బలహీనుడే అయినా, ఆమెపై అధికారం చెలాయిస్తూ వేధింపులకు గురి చేస్తుంటాడు. రోజూ హింస, అవమానాలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేస్తాయి. అతని ఇంటికి వచ్చే ఓ లాయర్ పరిస్థితిని మరింత భయంకరంగా మారుస్తాడు. అతను కూడా ఆమెను బలవంతపెట్టి శారీర‌కంగా వాడుకుంటాడు. ఈ సంఘటనలతో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోతుంది.

35
షాకింగ్ టర్నింగ్ పాయింట్

తన జీవితం ఇలా ఉండకూడదని నిర్ణయించుకున్న యువతి ఓ ప్లాన్ వేస్తుంది. ఓ రోజు భర్తను కొండపై నుంచి తోసేస్తుంది. అతను చనిపోకపోయినా, మంచానికే పరిమితం అవుతాడు. ఇక ఇంట్లో అతన్ని చూసుకునేందుకు ఓ మేల్ నర్స్ వస్తాడు. ఈ క్ర‌మంలో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. నర్స్‌తో ఆమె మధ్య ఓ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ క్రమంగా శారీరక సంబంధంగా మారుతుంది. ఇక్కడ నుంచే సినిమా మరింత డార్క్‌గా మారుతుంది.

45
ఆ నిర్ణయంతో జీవితం తలకిందులు

భర్త నుంచి పూర్తిగా విముక్తి కావాలని ఆమె మరోసారి నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి నేరుగా అతన్ని చంపాలనే ఆలోచనకు వస్తుంది. అందుకు మేల్ నర్స్ సహాయం తీసుకుంటుంది. కానీ ఈ నిర్ణయం వాళ్ల జీవితాలను ఏ దిశగా తీసుకెళ్లింది? ప్లాన్ సక్సెస్ అయ్యిందా? లేక అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయా? అన్నది సినిమాకి అసలైన సస్పెన్స్.

55
కొన్ని సీన్స్ అసౌకర్యంగా

‘చతురం’ సాధారణ థ్రిల్లర్ కాదు. మానవ మనస్తత్వం, కోరికలు, ప్రతీకారం వంటి అంశాలను చాలా నేరుగా చూపించిన సినిమా. కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించొచ్చు. అందుకే ఈ సినిమాను ఒంటరిగా చూడటం మంచిది. బోల్డ్ కంటెంట్, స్లో బర్న్ నేరేషన్, షాకింగ్ క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ప్రస్తుతం సైనాప్లే (Saina Play) ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. హిందీ వెర్ష‌న్ యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories