
ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మనిషి. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీతోనే గడుపుతాడు. చాలా అరుదుగానే బయటకు వస్తారు. ఏదైనా ఈవెంట్లకి గెస్ట్ గా మెరుస్తుంటారు. లేదంటే విదేశాలకు వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్ లో కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఆయన యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. తనని అభిమానించే వారికోసం, వారిని సపోర్ట్ చేయడానికి వచ్చారు.
తాజాగా ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తారక్, విశ్వక్‌ని గట్టిగా హగ్ చేసుకున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్, తారక్, సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ ఉన్న ఓ సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితేఈ ఫోటో వెనుక కథేంటి అనేది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి కారణం `టిల్లు స్వ్కేర్` అని తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటుంది. కలెక్షన్ల విషయంలో రచ్చ చేస్తుంది.
దీంతో ఈ మూవీని ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా ప్రదర్శించారట. ఇందులో విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కలిసి ఈ ఫోటో దిగారు. అనంతరం ఎన్టీఆర్, సిద్దు, విశ్వక్ సేన్, నాగవంశీ కలిసి సెల్ఫీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కలిసి దిగిన ఫోటో మరింతగా రచ్చ చేస్తుంది.
ఇదిలా ఉంటే `టిల్లు స్క్వేర్` సినిమా పెద్ద హిట్ కాబోతుంది. కలెక్షన్ల పరంగా దుమారం రేపుతుంది. ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ దాటుకుని లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 75కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దీంతో గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ని ప్లాన్ చేస్తున్నారట. దానికి ఎన్టీఆర్‌ని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారట. అందుకోసమే ఈ షో ఏర్పాటు, ఈ సెల్ఫీలు, ఫోటోలు దిగినట్టు తెలుస్తుంది.మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. యంగ్ హీరో విశ్వక్ సేన్‌ని సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తారక్ అంటే విశ్వక్ కి అంతటి అభిమానం. అందుకే విశ్వక్‌కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆ మధ్య విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్ కోసం `ఆస్కార్ ఈవెంట్‌ని వదులుకుని ఇండియాకి వచ్చేశాడు. విశ్వక్ సేన్ నటించిన `దమ్కీ` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సినిమాని ప్రమోట్ చేస్తూ అతని గురించి ఎన్టీఆర్ గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే.
సిద్దు జొన్నలడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్` చిత్రం గత శుక్రవారం విడుదలైంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దుమ్మురేపుతుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. `డీజే టిల్లు`కి సీక్వెల్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్స్ హిట్ కావడం చాలా అరుదు. ఆ విషయంలో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని చెప్పచ్చు. ఇప్పుడు వంద కోట్ల దిశగా వెళ్తుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.