
సంక్రాంతికి సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓవర్ నైట్ లో స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. మొదటి నుంచి వైవిద్యమైన కథలతో ప్రశాంత్ వర్మ తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ ఏ సినిమా చేయబోతున్నారనే విషయమై అందరి దృష్టీ ఉంది. అయితే ఈ దర్శకుడుపై వచ్చిన ఓ వార్త ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది. హిందీలో సినిమా మొదలెట్టి ప్రశాంత్ వర్మ ..నిర్మాతకు పాతిక కోట్లు నష్టం చేసారనే వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత ఉంది.
”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్ బాగా పెరిగింది. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా హిందీలో సినిమా మొదలెట్టారు.
ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను కూడా పెట్టారని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రం ఆగిపోయిందంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమా నుంచి రణ్ వీర్ సింగ్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది.
అలాగే ఇప్పటికే పాతిక కోట్లు దాకా ఖర్చు పెట్టినట్లు..అదంతా బూడిదలో పోసిన పన్నీరే అన్నట్లు చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉంది. నిజంగా పాతిక కోట్లు ఖర్చు పెట్టారా..దేనికి పెట్టారు. సినిమా ప్రారంభం కాకుండానే పాతిక కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయనేది అసలైన ప్రశ్న.
అందుతున్న సమాచారం మేరకు ..“వారు కేవలం ప్రమోషనల్ మెటీరియల్ మాత్రమే షూట్ చేసారు. అదీ రెండు రోజులు పాటు. దానికి ఎందుకు అంత ఖర్చు అవుతుంది. సెట్స్ కు వెళ్లి షూట్ చేయకుండా ఆ ఖర్చు ఎలా పెట్టగలరు. అవన్నీ అర్దం పర్దం లేని రూమర్స్ మాత్రమే.
ఇక ప్రశాంత్ వర్మ ఆయన టీమ్ ..రణ్ వీర్ సింగ్ తో ఓ అద్బుతమైన ఫొటో షూట్ ఒక రోజు చేసారు. అలాగే ఓ ప్రమోషనల్ వీడియో మరో రోజు చేసారు. ఈ వీడియోని బ్రహ్మ రాక్షస లేదా రాక్షస్ సినిమా లాంచ్ రోజున రిలీజ్ చేస్తారు. ఇవన్నీ బాలీవుడ్ లో కొందరు గిట్టని వారు చేస్తున్న అనవసరపు ప్రచారాలు మాత్రమే. అని సినిమాకు సంభందించిన వారు చెప్తున్నారు.
ప్రశాంత్ వర్మ టీమ్‌లోని ఓ మెంబర్ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. "క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రశాంత్ శర్మ, రణ్‌వీర్ సింగ్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. హనుమాన్ జయంతి రోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్ చేశారు. రణ్‌వీర్‌పై ఇప్పటికే కొన్ని సీన్లు కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. అని ఆ మెంబర్ స్పష్టత ఇచ్చారు.
హనుమాన్ సినిమా వర్క్ మెచ్చి ప్రశాంత్‌కు రణ్‌వీర్ ఛాన్స్ ఇచ్చారట. ఇది కూడా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే రాబోతుంది. మైథలాజికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథగా రానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే రణ్‌వీర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్య దీపికా పదుకొణెతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని తెలిసింది. భవిష్యత్‌లో ఆయన నుంచి డాన్ 2, శక్తిమాన్ లాంటి సినిమాలు కూడా రానున్నాయి.