బయటపడ్డ జబర్దస్త్ వర్ష మోసం... ఆ వీడియో బయటికి రావడంతో గుట్టు రట్టు.. మరీ ఇంత ఛీటింగా!

First Published Jun 24, 2021, 1:07 PM IST

ప్రమోషన్స్ కోసం బుల్లితెర నటుల ట్రిక్స్, ట్రాప్స్ చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. సెలెబ్రిటీలుగా ఉన్న శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి వంటి వారు తమ షోలు, వ్యాపారాలు, సిరీస్ ల ప్రమోషన్స్ కోసం చీటింగ్ ట్రిక్స్ వాడారు. తాజాగా జబర్దస్త్ వర్ష ఇలాంటి ట్రిక్ ప్లే చేసి దొరికిపోయింది. 
 

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన జబర్దస్త్ వర్ష జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పాపులర్ కామెడీ షో కావడంతో వర్ష తక్కువ కాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. మూడు సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా తెచ్చుకుంది అమ్మడు.
undefined
ఇక ఆ షోలో కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష కామెడీ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రతి కార్యక్రమంలో ఇద్దరూ జంటగా కనిపిస్తూ పరోక్షంగా మేము ప్రేమికులం అని హింట్ ఇచ్చారు. లవ్ బర్డ్స్ బ్రాండ్ ఇమేజ్ ఇద్దరి కెరీర్ కి మంచి ఊపు ఇచ్చింది.
undefined
ప్రేక్షకులు వర్ష, ఇమ్మానియేల్ జంటను బాగా ఇష్టపడుతున్నారు. ఇది గమనించిన నిర్వాహకులు చాలా కార్యక్రమాలలో వీరిని జంటగా చూపిస్తూ ప్రోగ్రామ్స్ రూపొందిస్తున్నారు.
undefined
రష్మీ, సుడిగాలి సుధీర్ తరువాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యారు.  కాగా ఇటీవల తనకు నిశితార్థం, పెళ్లి అంటూ సోషల్ మీడియా పోస్ట్స్ తో వర్ష సంచలనాలకు తెరలేపారు.
undefined
అయ్యో వర్షకు పెళ్లా... అని ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ నీరసపడ్డారు. అలాగే వర్ష వరించనున్న ఆ అదృష్టవంతుడు ఎవరని వాకబు చేశారు.
undefined
తీరా చూస్తే అది ఓ ప్రోగ్రాం ప్రమోషన్ కోసం వర్ష ఆడిన చీటింగ్ డ్రామా అని తెలిసింది. జులై 4వ తేదీన తన పెళ్ళికి సంబంధించిన వివరాలు బయటపెడతాను అని వర్ష తెలిపారు. నిజానికి అదే రోజు ఓ ఛానెల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసారం కానుంది.
undefined
శ్రీదేవి డ్రామా కంపెనీ రానున్న ఎపిసోడ్ లో వర్ష, ఇమ్మానియేల్ కి ఉత్తుత్తి పెళ్లి చేయనున్నారు. ఆ ప్రోగ్రాం తాజా ప్రోమోలో ఆ విషయం తెలియజేశారు. దీనితో వర్ష పెళ్లి డ్రామా అందరికీ అర్థమైపోయింది.
undefined
ఇక ఉత్తిత్తి పెళ్లిళ్లు ఎక్కువై పోయాయి. దాదాపు రెండు సార్లు రష్మీ, సుధీర్ ల వివాహం జరిగింది. అలాగే సీరియల్ నటులు నవ్య స్వామి, రవి కృష్ణకు ఇలాగే పెళ్లి చేశారు. ఈసారి వర్ష, ఇమ్మానియేల్ ని పెళ్లి మండపం ఎక్కించారు నిర్వాహకులు.
undefined
click me!