ప్రాసలకు పోయి పరువు పోగొట్టుకున్న యాంకర్‌ రష్మి.. జబర్దస్త్ కమెడియన్‌ని చూసి అత్యుత్సాహం..

First Published Mar 27, 2024, 7:51 AM IST

యాంకర్‌ రష్మి అత్యుత్సాహానికి పోయింది. జబర్దస్త్ కమెడియన్‌ ప్రాసలకు టెంప్ట్ అయ్యింది. తాను కూడా ట్రై చేసి పరువు పోగొట్టుకుంది. 
 

etv extra jabardasth promo

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. పదేళ్లుగా ఈ షోకి యాంకర్‌గా రాణిస్తుంది. షో రక్తికట్టడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. అందంతో, క్యూట్‌ మాటలతో అలరిస్తుంది. పొట్టి దుస్తుల్లో గ్లామర్‌ షో చేస్తూ, చిలిపి నవ్వులతో కొంటెగా కవ్విస్తుంది రష్మి. అందుకే ఈ బ్యూటీకి మంచి క్రేజ్‌ ఉంది. 

etv extra jabardasth promo

జబర్దస్త్ షోతో పాపులర్‌ అయ్యింది రష్మి. అంతకుముందు సీరియల్స్, సినిమాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గుర్తింపు రాలేదు. కానీ `జబర్దస్త్` షో మాత్రం ఆమెకి మంచి క్రేజ్ ని ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్‌ని మరింత పంచుకుంటూ రచ్చ చేస్తుంది. 
 

etv extra jabardasth promo

ప్రస్తుతం రష్మి `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఎక్కువగా `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఆమె కంటెంట్‌ ఇస్తుంటుంది. తాజాగా మరోసారి ఆమె కంటెంట్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. జబర్దస్త్ కమెడియన్‌ ప్రాసలతోరెచ్చిపోవడంతో తాను ట్రై చేసింది. ముందుగానే ఊహించి తను కూడా పంచ్‌లు విసరాలని భావించింది. కానీ అడ్డంగా బుక్కయ్యింది. 

etv extra jabardasth promo

తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో చాలా గ్యాప్‌తో `బ్రో లక్ష్మణ్‌` రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్కిట్లతో అలరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన జోడీతో కలిసి తనదైన ప్రాసలతో రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి కూడా అదే స్థాయిలో ప్రాసలతో డైలాగ్‌లు పేల్చింది. 
 

etv extra jabardasth promo

బ్రో లక్ష్మణ్‌.. తన లవర్‌ని పరిచయం చేస్తూ, ` నా లవర్‌ పేరు వైశాలి, షీ ఈజ్‌ ఫ్రమ్‌ బెంగాలి` అని చెప్పాడు లక్ష్మణ్‌. దీనికి ఆమె స్పందిస్తూ, `ఇప్పటి వరకు నువ్వు కొట్టావో లేదో తెలియదు. ఈసారి మాత్రం కచ్చితంగా కొట్టి తీరాల్సిందే` అని డైలాగ్‌ పేల్చింది.  దీనికి ఆవేశంలో యాంకర్‌ రష్మి స్పందించింది. `బ్రో.. ఈ టీమ్‌లో వచ్చింది బెంగాలి... స్కిట్టు,... కొట్టాలి` అని తనదైన స్టయిల్‌లో డైలాగ్‌ విసిరింది. కానీ పాపం రష్మిక ఆ డైలాగ్‌ ఏంటో సరిగా రాలేదు. ఏదో చెప్పాలనుకుంది. కానీ అది రాలేదు. దీంతో ఇంకేదో అయ్యింది. మొత్తంగా ప్రాస కోసం ట్రై చేసి పరువు గోట్టుకుంది జబర్దస్త్ రష్మి.
 

etv extra jabardasth promo

ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ స్కిట్‌, నూకరాజు స్కిట్లు బాగా పేలాయి. ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ని పట్టుకుని కృష్ణభగవాన్‌.. అంతా మీ చెల్లేల్లే, కానీ నీ మీదే డౌట్‌ అని చెప్పడం మరింతగా నవ్వులు పూయించింది. 
 

click me!