యాంకర్ రష్మీ అసలు వయసు అంతా? ఓ స్టార్ కమెడియన్ ప్రియురాలు కూడానా? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Published : Mar 11, 2024, 06:58 AM IST

స్టార్ యాంకర్ గా వెలిగిపోతుంది రష్మీ గౌతమ్. ఈ వైజాగ్ భామ వయసుపై ఒక ఆసక్తికర  చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అసలు రష్మీ గౌతమ్ వయసు ఎంత? దీనికి సంబంధించిన కొన్ని వివరాలు షాక్ ఇస్తున్నాయి.   

PREV
16
యాంకర్ రష్మీ అసలు వయసు అంతా? ఓ స్టార్ కమెడియన్ ప్రియురాలు కూడానా? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!
Rashmi Gautam

అమ్మాయిలను వయసు, అబ్బాయిలను సంపాదన అడగకూడదు అంటారు. ఇక సెలెబ్రిటీలు అయితే వయసు దాచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఏజ్ బార్ అయ్యాక ఆఫర్స్ రావు. అందుకే సాధ్యమైనంత వరకు వయసు గురించి వివరాలు దాచేస్తారు. అయితే వికీపీడియాలో వాళ్ళ డిటేల్స్ ఉంటాయి. 


 

26

యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుత వయసు 41. ఆమె 1982లో విశాఖపట్నంలో పుట్టింది. కానీ రష్మీ గౌతమ్ తన వయసు 37గా చెప్పుకుంటుంది. మరి రష్మీ గౌతమ్ రియల్ ఏజ్ ఎంత? అనే సందేహం అయితే ఉంది. ఆమె కెరీర్ పరిశీలిస్తే... 2002లో నటిగా మొదలైంది. 

36
Rashmi Gautam

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ హోలీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఉదయ్ కిరణ్-రిచా జంటగా నటించిన హోలీలో కమెడియన్ సునీల్ ప్రియురాలిగా రష్మీ గౌతమ్ పాత్ర ఉంటుంది. రష్మీ-సునీల్ మధ్య మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయి. హోలీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

 

46
Rashmi Gautam

అనంతరం కరెంట్, బిందాస్ చిత్రాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అంటే 22 ఏళ్ల క్రితమే రష్మీ గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చింది. కాబట్టి ఆమె ఏజ్ 40 ప్లస్ ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరేమో రష్మీ కెరీర్ టీనేజ్ లో స్టార్ట్ అయ్యింది. కనుక ఆమె ఏజ్ నలబై లోపే అంటున్నారు. 
 

56


ఇక వికీపీడియా ప్రకారం అయితే రష్మీ గౌతమ్ వయసు 41. ఆమె వయసు గురించి ఇంత చర్చ జరగడానికి అసలు కారణం... రష్మీ పెళ్లి చేసుకోలేదు. రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడో దాటిపోయింది. ఆమె ఇంకా ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారనే చర్చ జరుగుతుంది. 

 

66

మరోవైపు రష్మీ గౌతమ్ హీరో సుడిగాలి సుధీర్ ప్రియురాలు అనే వాదన ఉంది. వీరిద్దరూ బుల్లితెర మీద విపరీతంగా రొమాన్స్ చేశారు. రష్మీ-సుధీర్ కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పాలి. అటువైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఏదో ఒక రోజు సడన్ గా ఇద్దరూ పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories