అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం అప్ కమింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుడిగా అలరించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా భాష, యాస నేర్చుకున్నారు.
26
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తండేల్’ (Thandel) అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
36
అయితే ఈ చిత్రానికంటే ముందుకు నాగచైతన్య నుంచి ఓ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గతంలో హిట్లు.. ఫ్లాప్స్లు పట్టించుకోని చైతూ ప్రస్తుతం ఆచీతూచీ అడుగేస్తున్నారు. డైరెక్టర్లకు కూడా ముందువెనక చూసి అవకాశం ఇస్తున్నారు.
46
Naga Chaitanyas second wedding
కాగా.. నాగచైతన్యను ఓ డైరెక్టర్ మోసం చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. మోసం అంటే ఏదోలా కాదు.. తనతో సినిమా స్టార్ట్ చేసి ఓ బిగ్ స్టార్ పిలవగానే చైతూనే పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయనను అప్సెట్ చేసింది.
56
ఆ దర్శకుడు మరెవరో కాదు పరుశురామ్ పెట్ల అనేది కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పరుశురామ్ కూడా అప్పట్లో వివరణ ఇచ్చారు. అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పారు.
66
ఇదిలా ఉంటే.. కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ చైతూ తో సినిమా చేస్తానని హామీనిచ్చిన ఆ దర్శకుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చైతూను నమ్మించి మోసం చేశారంటూ ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. అటు చైతూ కూడా కోపంగానే ఉన్నారని తెలుస్తోంది. మరీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.