యాంకర్‌ సిరి హన్మంత్‌కి ఆఫర్లు లేవా? నెక్ట్స్ కూరగాయల బండేనా?.. జబర్దస్త్ కమెడియన్‌ దారుణమైన కామెంట్‌

Published : May 27, 2024, 06:54 PM ISTUpdated : May 27, 2024, 08:53 PM IST

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన సిరి హన్మంతు ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెని దారుణంగా అవమానించాడు జబర్దస్త్ కమెడియన్‌.   

PREV
16
యాంకర్‌ సిరి హన్మంత్‌కి ఆఫర్లు లేవా? నెక్ట్స్ కూరగాయల బండేనా?.. జబర్దస్త్ కమెడియన్‌ దారుణమైన కామెంట్‌

జబర్దస్త్ షోకి యాంకర్‌గా అనసూయ మానేసిన తర్వాత చాలా యాంకర్లు ఇద్దరు మారారు. సౌమ్యరావుని తీసుకున్నారు. ఆమె కొన్నాళ్లు బాగానే అలరించినా రేటింగ్‌ రాకపోవడంతో సౌమ్యరావుని పక్కన పెట్టారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ ఫేస్‌ సిరి హన్మంత్‌ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 

26

సిరి హన్మంతు ప్రారంభంలో కాస్త సైలెంట్‌గా ఉన్నా, నెమ్మదిగా యాక్టివ్‌ అవుతుంది. తను కూడా చలాకీగా మారుతుంది. కానీ అనసూయ రేంజ్‌లో కాకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది. అయితే ఆమె ప్రస్తుతం జబర్దస్త్ షో మాత్రమే చేస్తుంది. ఈ ఒక్క షోకే పరిమితమయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్‌. తమ కామెడీ కోసం సిరిని వాడుకోవడం గమనార్హం.  
 

36

తాజాగా నూకరాజు టీమ్‌ బుర్రకథ స్కిట్‌ని ప్రదర్శించారు. మొదట జడ్జ్ ఇంద్రజ గురించి చెప్పారు. ఆమె దానలు చేస్తుందని, విశాల హృదయం అని, చెన్నై నుంచి వస్తుందని, వచ్చే చెక్కులు తక్కువే అని తెలిపాడు. ఇలా ఆమెని ఆకాశానికి ఎత్తేశాడు నూకరాజు. అనంతరం సిరి ప్రస్తావన వచ్చింది. 

46

ఇక సిరి విషయానికి వస్తే, తను టీవీలో కనిపించేది థర్స్ డే(గురువారం). నెక్ట్స్ షెడ్యూల్‌ నుంచి హాలీడే, ఛాన్స్ లు లేక ఆమెకి మండే, నెక్ట్స్ కూరగాయల బండే` అంటూ బుర్రకథ చెప్పాడు నూకరాజు. దీంతో అంతా నవ్వులు పూయించారు. సిరి కూడా నవ్వులు చిందించింది. అయితే కామెడీ కోసం చెప్పడంతో దీన్ని అంతా పాజిటివ్‌గానే తీసుకున్నారు. సిరి కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుంది. 
 

56

కానీ ఇండైరెక్ట్ గా ఆమెకి ఇది తీరని అవమానమనే చెప్పాలి. నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూకరాజు కాస్త అతి చేశాడని, ఆఫర్లు లేవని కూరగాయల బండి పెట్టుకుంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కామెడీ చేయాలి కానీ వారిని దిగజార్చి కామెడీ చేయడం సరికాదంటున్నారు. ఇది సిరికి తీవ్రమైన అవమానమే అంటున్నారు నెటిజన్లు. మరి ఆమె రియాక్షన్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. 
 

66

నిజానికి సిరి యూట్యూబర్‌ గా పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. అందులో టాప్‌ 5 వరకు వెళ్లింది. షణ్ముఖ్‌తో జోడీ కట్టి వివాదాల్లో ఇరుక్కుంది. ఆ తర్వాత నీట్‌ గా దాన్నుంచి బయటపడింది. తన ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి ఉంటుంది. ఆ మధ్య వెబ్‌ సిరీస్‌ చేశారు. ఓటీటీ ఫిల్మ్ చేశారు. అంతేకాదు షారూఖ్‌ ఖాన్‌ నటించిన `జవాన్‌`లోనూ మెరిశారు. ఇలా ఒకటి అర ఆఫర్లతో సినిమాల్లో మెరుస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదని తెలుస్తుంది. ఆమెకి జబర్దస్త్ షోనే పేరు, క్రేజ్‌ తీసుకొస్తుంది. ఈ షోతో అనసూయ మాదిరిగా బాగా ఎదిగి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories