హీరో శ్రీకాంత్‌ కూతురు ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా?.. అంత సీక్రెట్ గా మెయింటేన్‌ చేస్తున్నారా?

Published : May 27, 2024, 05:35 PM IST

హీరో శ్రీకాంత్‌ కూతురు మేధ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుందో తెలుసా?.. ఇటీవల చూడ్డానికి హీరోయిన్‌లా కనిపించిన మేధని ఇంత సీక్రెట్‌గా పెంచుతున్నారా?  

PREV
17
హీరో శ్రీకాంత్‌ కూతురు ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా?.. అంత సీక్రెట్ గా మెయింటేన్‌ చేస్తున్నారా?

హీరో శ్రీకాంత్‌ ఫ్యామిలీ స్టార్‌ ఇమేజ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చాడు. అనేక స్ట్రగుల్స్ పడి ఆయన హీరోగా ఎదిగాడు. చిన్న చిన్న పాత్రల దశ నుంచి నెగటివ్‌ రోల్స్ కూడా చేసి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ కంటెంట్‌ ఉన్న సినిమాల్లో నటించి హీరోగా ఎదిగాడు. ఫ్యామిలీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. 
 

27

ఓ వైపు హీరోగా చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడు, అవకాశాన్ని, పాత్ర డిమాండ్‌ని బట్టి ఇతర హీరోల సినిమాల్లోనూ మరో హీరోగా నటించి మెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిరంజీవి, జగపతిబాబు, జేడీ చక్రవర్తి, నాగార్జున ఇలా చాలా మంది హీరోలతో కలిసి నటించాడు. ఇటీవల హీరో నుంచి విలన్‌గా, క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు నటుడిగా ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 
 

37

శ్రీకాంత్‌.. హీరోయిన్‌ ఊహని ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఊహా సినిమాలు మానేసింది. వీరికి ముగ్గురు పిల్లలు. రోషన్‌, మేధ, రోహన్‌. రోషన్‌ హీరోగా పరిచయం అయ్యాడు. `నిర్మల కాన్వెంట్‌`, `పెళ్లి సందడి` చిత్రాలు చేశాడు. ఇప్పుడు మలయాళంలో మోహన్‌లాల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. మరి మిగిలిన ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడున్నారనే విసయాలు ఆసక్తికరంగా మారాయి. 
 

47

తాజాగా హీరో శ్రీకాంత్‌ ఆ విషయాలను వెల్లడించారు. తన కూతురు గురించి చెప్పాడు శ్రీకాంత్‌. కూతురు మేధ విదేశాల్లో ఉంటుందట. కెనడాలో ఆమెచదువుకుంటుందట. ఉన్నత చదువుల రీత్యా ఆమె విదేశాల్లో ఉంటుందని తెలిపారు శ్రీకాంత్‌. అయితే అక్కడ ఎవరికి మేధ తన కూతురు అనే విషయం తెలియదట. చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నప్పటికీ తను శ్రీకాంత్‌ కూతురు అని ఎవరికీ తెలియదని చెప్పాడు. 

57

మరో కొడుకు రోహన్‌ కూడా అంతే. విదేశాల్లో చదువుతున్నారు. కానీ వాళ్లు ఎక్కడా తాను శ్రీకాంత్‌ కొడుకు, కూతురు అని చెప్పుకోరట. సాధారణ స్టూడెంట్స్ లాగే ఉంటారు. రికమండేషన్లకి తన పేరుని వాడుకోరని, తమ పాట్లేదే వాళ్లు పడుతుంటారని తెలిపాడు శ్రీకాంత్‌.
 

67

హిట్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ ఈ విషయాలను వెల్లడించాడు. అంతే చాలా సీక్రెట్‌గా పిల్లలను పెంచుతున్నారు శ్రీకాంత్‌ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

77

ఇటీవల బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో శ్రీకాంత్‌ పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి శ్రీకాంత్‌ని పోలినట్టు ఉండటంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే అతను తాను కాదని వెంటనే వివరణ ఇచ్చాడు శ్రీకాంత్‌. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు గురించి తెలిపాడు శ్రీకాంత్‌. ఇటీవల ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో మీడియా కంటపడింది. దీంతో అంతా హీరోయిన్‌ మెటీరియల్‌ అని, త్వరలోనే హీరోయిన్‌ కాబోతుందంటూ కామెంట్లు చేశారు. మరి శ్రీకాంత్‌ తన కూతురుని హీరోయిన్‌ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories