Swetha: బిగ్ బాస్ హౌస్ నుంచి స్వేత అవుట్.. టాప్ 3 ఎవరో తేల్చేసిన బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది అల్లాడించాడుగా

Published : Nov 15, 2026, 10:34 PM IST

బిగ్ బాస్ తెలుగు 10లో 70వ రోజు ఆదివారం ఎపిసోడ్ చాలా సందడిగా సాగింది. అదే విధంగా స్వేత ఎలిమినేషన్ కూడా జరిగింది. హైపర్ ఆది స్టేజీపైకి వచ్చి తన పంచ్ లతో అందరి లెక్కలు తేల్చేశారు.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు 10లో భాగంగా నవంబర్ 15న ఆదివారం రోజు ఎపిసోడ్ చాలా స్పెషల్ గా సాగింది. పలువురు సెలెబ్రిటీలు, ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు హౌస్ స్టేజీపై సందడి చేశారు. ప్రతి సీజన్ కి హైపర్ ఆది వచ్చి తనదైన శైలిలో పంచ్ లతో ఒక్కొక్కరి ఆట తీరు గురించి రివ్యూ ఇస్తుంటాడు. ఈ సారి కూడా హైపర్ ఆది పంచ్ లు గట్టిగానే పేలాయి.

24
హైపర్ ఆది పంచులే పంచులు

ముఖ్యంగా కొందరిపై హైపర్ ఆది వేసిన జోకులు, సెటైర్లు నవ్వులు పూయించాయి. ముఖ్యంగా వంశీ గురించి హైపర్ ఆది భలే కామెంట్స్ చేశాడు. సినిమాల్లో విలన్ గా వంశీ అందరినీ రక్తం వచ్చేలా కోస్తాడు. అలాంటి వంశీ హౌస్ లో కూరగాయలు కోస్తున్నాడు అని హైపర్ ఆది తెలిపారు. త్రిగుణ్ బిగ్ బాస్ తెలుగు 10 దశావతారంలో కమల్ హాసన్ కంటే ఎక్కువ అవతారాలు చూపిస్తున్నావు అని ఆది అన్నారు. నాగార్జునతో ఆది మాట్లాడుతూ.. నాకు A అంటే యాపిల్ అని తెలుసు. కానీ బి అంటే పి అంటే ఏంటో నాకు కూడా తెలియదు సార్ అంటూ వర్షిణిపై సెటైర్లు వేశారు.

34
టాప్ 3 ఎవరో తేల్చేసిన బుల్లెట్ భాస్కర్

బుల్లెట్ భాస్కర్ కూడా స్టేజీపైకి గెస్ట్ గా వచ్చారు. నీ దృష్టిలో టాప్ 3 ఎవరు అని నాగార్జున ప్రశ్నించగా.. నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ అని బుల్లెట్ భాస్కర్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. బాటంలో రామ్ ప్రసాద్, సుధీర్, స్వేతా నిలిచారు. అందరూ చేయి పెట్టి స్కాన్ చేయగా స్వేత ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు. స్వేత ఎలిమినేషన్ తో అమన్ బాగా ఎమోషనల్ అయ్యాడు. నాగార్జున వద్దకు వెళ్లిన తర్వాత స్వేత మాట్లాడుతూ.. అమన్ చాకు లాంటి వాడు.

44
స్వేత అవుట్

మంచి కోసం యూజ్ చేస్తే చాలా సాధిస్తాడు. నువ్వు కప్పు గెలవాలి అని అమన్ కి స్వేతా చెప్పింది. దేబ్జానీ గురించి మాట్లాడుతూ.. ఆమెకి రామ్ ప్రసాద్ అన్న ఒక షీల్డ్ లాగా ఉంటున్నాడు. కానీ ఆమె గేమ్ సొంతంగా ఆడడం లేదు అని స్వేత పేర్కొంది. ఎదుటి వాళ్ళు చెప్పేది విని ఆ తర్వాత ముకేశ్ నిర్ణయం తీసుకుంటే మంచిది అని స్వేత పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories