`బిగ్‌ బాస్‌ తెలుగు 9` కంటెస్టెంట్ల లిస్ట్.. కన్ఫమ్‌ అయిన ఆర్టిస్ట్ లు వీరే

Published : Jul 13, 2025, 05:33 PM ISTUpdated : Jul 13, 2025, 05:45 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ రియాలిటీ షోకి సంబంధించిన ఆసక్తికర అప్‌ డేట్‌ వినిపిస్తుంది. కొందరు కంటెస్టెంట్లు ఇప్పటికే ఫైనల్‌ అయినట్టు తెలుస్తోంది. వాళ్లెవరో చూద్దాం. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్ల లిస్ట్

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌ సందడి ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ ప్రోమోని ఇప్పటికే విడుదల చేశారు. అదే సమయంలో కామన్‌ మ్యాన్‌కి అవకాశం కల్పిస్తూ మరో ప్రోమోని కూడా విడుదల చేశారు. 

గతంలో ఒక్కరికే కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో అవకాశం కల్పించేవారు, ఇప్పుడు ఇద్దరు, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

25
బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వినిపిస్తున్న పేర్లు ఇవే

మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతుంది. చాలా మంది ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ల పేర్లు తెరపైకి వచ్చాయి.

 కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న పేర్లలో రీతూ చౌదరీ, దీపికా, కావ్య శ్రీ, తేజస్విని, దేబ్జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి, సాయి కిరణ్‌, ఛత్రపతి శేఖర్‌, ఇమ్మాన్యుయెల్‌, 

సుమంత్‌ అశ్విన్‌, ముఖేష్‌ గౌడ, శివ కుమార్‌, నవ్యసామి, మై విలేజ్‌ షో అనిల్‌, ప్రదీప్‌ వంటి వారు ఈ సారి కంటెస్టెంట్లుగా షోలోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

35
అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల ఫైనల్‌

ఇదిలా ఉంటే వీరిలో ఎవరు ఫైనల్‌ అయ్యారు? ఎవరు హౌజ్‌లోకి రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో కొందరు కంటెస్టెంట్లు ఫైనల్‌ అయినట్టు సమాచారం.

 వారిలో ప్రధానంగా ఉంది అలేఖ్య చిట్టి పికిల్‌ అమ్మాయి రమ్య. రమ్య గోపాల్‌ కాంచర్ల `అలేఖ్య చిట్టి పికిల్స్` అమ్మాయిల్లో ఒకరు. జిమ్‌లో ఎక్స్ సైజ్‌లు చేస్తూ బాడీ బిల్డర్‌గా కనిపిస్తుంది. 

అదే సమయంలో అందంగానూ ఉంటూ అందరిని ఆకర్షిస్తుంది. ఆమెని కంటెస్టెంట్‌గా ఓకే చేశారట. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో రమ్య పేరు బాగా వినిపించింది. బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెని బిగ్‌ బాస్‌ టీమ్‌ ఫైనల్‌ చేసిందని సమాచారం.

45
కావ్య శ్రీ, ఇమ్మాన్యుయెల్‌, నవ్యసామి ఫైనల్‌ అయినట్టు టాక్‌

ఆమెతోపాటు జబర్దస్త్ కమెడియన్‌ ఇమ్మాన్యుయల్‌ కూడా కన్ఫమ్‌ అయ్యారు. ఆయన గత రెండు మూడు ఎపిసోడ్లుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. 

ఆయన్ని బిగ్‌ బాస్‌ టీమ్‌ అప్రోచ్‌ అయ్యిందని, ఓకే అయ్యాడని సమాచారం. ప్రస్తుతం ఆయన బిగ్‌ బాస్‌ నిర్వాహకుల పరిధిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆయనతోపాటు టీవీ నటి, బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌ నిఖిల్‌ ప్రియురాలు కావ్య కూడా కన్ఫమ్‌ అయ్యిందట. ఈ షో కోసం ఆమె కూడా తన టీవీ సీరియల్‌ని వదులుకుందని టాక్‌. 

మరోవైపు టీవీ పాపులర్‌ నటి నవ్యసామి కూడా ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. నవ్య సామి కూడా బుల్లితెరపై స్టార్‌ నటిగా రాణిస్తోన్న విషయం తెలిసిందే.  

అలాగే ఇటీవల వివాదాల్లో నిలిచిన కల్పిక గణేష్‌ కూడా ఓకే అయ్యిందని టాక్‌.

55
సుమంత్‌ అశ్విన్‌, సాయికిరణ్‌, శివకుమార్‌ కన్ఫమ్‌ అని టాక్‌

వీరితోపాటు సుమంత్‌ అశ్విన్‌ కూడా కన్ఫమ్‌ లిస్ట్ లో ఉన్నారట. సాయి కిరణ్‌ పేరు కూడా కన్ఫమ్‌ కంటెస్టెంట్ల లిస్ట్ లో వినిపిస్తుంది. శివ కుమార్‌ సైతం ఓకే అయ్యారట. 

అయితే తేజస్విని, రీతూ చౌదరీ, దేబ్జానీ వంటి ఆర్టిస్ట్ లకు సంబంధించిన కన్ఫర్మేషన్‌ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ సారి క్రేజీ కంటెస్టెంట్లు రాబోతుండట విశేషం. 

అదే సమయంలో టీవీ ఆర్టిస్ట్ లను గట్టిగానే దించుతున్నారు. వీరి వల్ల బుల్లితెర ఆడియెన్స్ వ్యూవర్‌ షిప్‌ పెరుగుతుందని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. 

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories