అవకాశం ఉంటే మళ్లీ నా భర్త అభిషేక్ తో నటిస్తాను, ఐశ్వర్యారాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Jun 09, 2022, 02:08 PM IST

బాలీవుడ్ సీనియర్ నటి ఐశ్వర్యారాయ్ తన భర్తతో కలసి నటించడానికి సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. మళ్లీ అవకాశం రావాలి కాని.. అభిశేక్ తో సినిమా చేయాలని ఉందంటూ.. మనసులో మాట బయట పెట్టింది బ్యూటీ.. మరి వీరి సినిమాకు ముహూర్తం ఎప్పుడు..? 

PREV
17
అవకాశం ఉంటే మళ్లీ నా భర్త అభిషేక్ తో నటిస్తాను, ఐశ్వర్యారాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్... ఇప్పటికి ఏమాత్రం చెక్కు చెదరనిసొగసులతో.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తుంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ మెయింటేన్ చేస్తున్న ఐశ్వర్యారాయ్ చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతోంది. 
 

27

తన భర్త అభిషేక్ తో కలిసి నటించాలి అని ఉంది అని కోరికను బయట పెట్టింది ఐశ్వర్య.  వీరిద్దరూ గతంలో రావణ్, దాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో సహా ఎన్నో సినిమాల్లో కలసి నటించారు. చివరిగా వీరిద్దరూ కనిపించిన సినిమా గురు, 2007లో వచ్చిన ఈ సినిమాను  మణిరత్నం డైరెక్ట్ చేశారు.  

37

అభిషేక్ బచ్చన్ తో పెళ్లి, తర్వాత వారికి  ఒక కూతురు కూడా జన్మించింది.  సినిమాలకు స్వస్తి చెప్పి.. కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉండిపోయింది ఐశ్వర్యారాయ్. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలవైపు చూస్తోంది. 

47

ఇంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలోనే పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ఐశ్వర్య పనిచేస్తోంది. నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య నటిస్తున్న సినిమా ఇదే. అభిషేక్ తో కలసి మళ్లీ ఎప్పుడు నటిస్తారు? అన్న ప్రశ్నకు ఆమె ఆకాశం వైపు చూసి.. ఇది జరుగుతుంది అని సమాధానం ఇచ్చింది. 
 

57

ఇప్పటికీ నా కుటుంబం, నా కుమార్తెకే నా ప్రాధాన్యం. మణి సర్ పొన్నియిన్ సెల్వన్ సినిమాను పూర్తి చేసేందుకు దైర్యం చేసి బయటకు వచ్చాను. అయినా, నా కుటుంబం, ఆరాధ్య  పట్ల నా బాధ్యతలో ఎటువంటి మార్పు లేదు అని ఐశ్వర్యారాయ్ నిక్కచ్చిగా చెప్పేసింది. 

67

రీసెంట్ గా  దుబాయిలో ఐఫా అవార్డుల ఫంక్షన్ లో ఐశ్వర్య, అభిషేక్ డ్యాన్స్ చేసి సందడిచేశారు. ఐశ్వర్యతో కలసి నటించడాన్ని ఇష్టపడతానని, సరైన సమయంలో మంచి స్క్రిప్ట్ దొరికితే.. తప్పుకుండా  ఐశ్వర్యారాయ్ తో కలిసి నటిస్తానని చెప్పాడు అభిషేక్ బచ్చన్. 

77

చూస్తుంటే ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్న ఈ తార.. త్వరలో రజనీ కాంత్ జతగా మరో సినిమాకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు సమాచారం. 
 

click me!

Recommended Stories