Salaar: పాపం వేణు స్వామి, ప్రభాస్ కి ఇక కెరీరే లేదన్నాడు.. ఫ్యాన్స్ చూశారా ఎలా ఆడేసుకుంటున్నారో..

Published : Dec 22, 2023, 03:06 PM ISTUpdated : Dec 22, 2023, 03:08 PM IST

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

PREV
17
Salaar: పాపం వేణు స్వామి, ప్రభాస్ కి ఇక కెరీరే లేదన్నాడు.. ఫ్యాన్స్ చూశారా ఎలా ఆడేసుకుంటున్నారో..

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. 

27

ఆయన బాగా పాపులర్ అవుతుండడంతో సెలెబ్రిటీలు కూడా వేణు స్వామి వెంట పడుతున్నారు. ఆయన దగ్గర తమ జాతకాలు చెప్పించుకోవడం, దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయించుకోవడం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎంత బడా స్టార్ జాతకం అయినా వేణు స్వామి ఇట్టే చెప్పేస్తారు. అయితే తాజాగా వేణు స్వామిపై సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. 

37

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది. ఇక బాక్సాఫిస్ వద్ద గత రికార్డులు నిలబడడం కష్టమే అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు నిజమే.. కానీ ప్రభాస్ లాంటి కటౌట్ కి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తగిలితే బాక్సాఫీస్ వద్ద గర్జన మామూలుగా ఉండదు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా జూలు విదల్చబోతున్నాడు. 

47

ఇదిలా ఉండగా ఆదిపురుష్ పరాజయం తర్వాత వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభాస్ కెరీర్ నిలబడదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తన కెరీర్ లో చూడాల్సిన పీక్ హైట్స్ చూసేశారు. డౌన్ ఫాల్ మొదలయింది. ఇక ప్రభాస్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది అని తెలిపారు. 

57

కానీ సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ఆడేసుకుంటున్నారు. ఇన్నిరోజులు పాటు వేణు స్వామి గాలిమాటలు చెప్పి పబ్లిసిటీ కొట్టేశారని.. వేణు స్వామిని ఒక రౌండ్ సోషల్ మీడియాలో వేసుకుని బుద్ది చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్ షురూ చేశారు. 

67

కొందరు అభిమానులు ఏంటి ప్రభాస్ కి ఇక కెరీర్ లేదా.. అయితే ముందు నువ్వెళ్ళి మంచి జాతకం చెప్పించుకో అంటూ సలహా ఇస్తున్నారు. మరో నెటిజన్ మొన్న తెలంగాణ ఎన్నికల్లో వెనుస్వామి కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు. అది బెడిసికొట్టింది. ప్రభాస్ కి కెరీర్ ఉండదని చెప్పారు.. సలార్ తో ఇది కూడా బెడిసికొట్టింది. వేణు స్వామికి అమ్మవారి పూజ చేయించాలి నా దగ్గరకి వస్తారా అంటూ సెటైర్ వేశారు. ఇలా రకరకాల మీమ్స్ వేణు స్వామిపై ట్రెండ్ అవుతున్నాయి. 

77

ప్రభాస్ బాహుబలితోనే చూడాల్సిన హైట్స్ చూసేశాడు. ప్రభాస్, రాజమౌళి ఇద్దరిదీ విచిత్రమైన జాతకం. ప్రభాస్ కి కెరీర్ డౌన్ ఫాల్ చాలా త్వరగా స్టార్ట్ అయింది. రాజమౌళికి ఇంకా సమయం ఉంది. ప్రభాస్ ఇకపై మళ్ళీ ఈశ్వర్ లాంటి చిన్న సినిమాలు చేసుకోవాల్సిందే అంటూ వేణు స్వామి గతంలో చెప్పాడు. సలార్ భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం. థియేటర్స్ లో రీ సౌండింగ్ రెస్పాన్స్ అందుకుంటోంది. 

click me!

Recommended Stories