నందమూరి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ టైటిల్ ఇదేనా? .. నిజమైతే ఇది మామూలు ఎంట్రీ కాదు

First Published | Sep 5, 2024, 5:35 PM IST

మోక్షజ్ఞ (Mokshagna) సినీరంగ ప్రవేశం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.నందమూరి అభిమానులని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఊరిస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు మరి కొద్ది గంటల్లోనే రాబోతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

అందరు ఊహించినట్లుగానే బాలకృష్ణ ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు. ఇప్పుడు ఈ కాంబోకి సంబంధించి ప్రశాంత్ వర్మ ఓ పోస్ట్ షేర్ చేసారు.  మరి ప్రశాంత్ వర్మ ఇదే విషయాన్ని చెబుతారో, లేదో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.
 

 నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీరంగ ప్రవేశం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు వారి ఆసక్తిని మరింత పెంచుతున్నారు. ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు.
 


రెండు రోజుల క్రితం ఒక సింహం తన పిల్లను చూపుతోన్న ఫొటో పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీనితో మోక్షజ్ఞ కోసమే ఈ పోస్ట్ పెట్టారంటూ నందమూరి అభిమానులు ఆనందపడ్డారు

. తాజాగా మరో పోస్ట్‌తో వారిలో ఆనందాన్ని రెట్టింపు చేశారు. ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ మరో పోస్ట్ పెట్టారు. 

రేపు ఉదయం 10.36కు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెబుతానని పేర్కొన్నారు.   ఈ క్రమంలో మోక్షజ్ఞ చేయబోతున్న ఫస్ట్ మూవీ టైటిల్ ఏమై ఉంటుంది. ఏ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు, మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? హీరోయిన్ ఎవరు? స్టోరీ ఎలా ఉండబోతోంది? బాలయ్య ఉంటారా? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. 

ఇక మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ తొలి చిత్రానికి 'గాండీవ' అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో 1994లో బాలకృష్ణ, అక్కినేని కాంబినేషన్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో గాండీవం అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా ఆడలేదు.

దాంతో ఈ టైటిల్ ఓకే చేసేముందు బాలయ్య ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే అవకాసం ఉంది. ఇక బాలయ్యకు ఈ టైటిల్ నచ్చినా  అఫీషియల్ గా అయితే  ఇప్పడిప్పుడే ప్రకటించరు. 

 ఈ చిత్రానికి తన కుమార్తె తేజస్వినీనే ప్రొడ్యూస్ చేయనున్నట్లు బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్​డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.

అక్టోబరులో మొదలుపెట్టాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 
 

ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ మోక్షజ్ఞ క్రమంగా యాక్టివ్ అవుతున్నాడు. నందమూరి అభిమాన సంఘ నాయకులని తరచుగా కలుస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న చిత్రాల సెట్స్ కి కూడా వెళుతున్నాడు. ఈ మధ్యన మోక్షజ్ఞ.. నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలో సందడి చేశాడు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. 

Latest Videos

click me!