అంతా చేయిస్తుంది నాగబాబే!... మల్లెమాలపై ఆయన పగ ఇంకా చల్లారలేదా?

Published : Jul 12, 2022, 10:13 AM IST

కమెడియన్ కిరాక్ ఆర్పీ ఇటీవల ఇంటర్వ్యూలో మల్లెమాలపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. వాళ్ళు పెట్టే ఆహారం చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు పెట్టే ఆహారం కంటే నీచంగా ఉంటుంది. మమ్మల్ని దారుణంగా ట్రీట్ చేశారు. జబర్దస్త్ కమెడియన్స్ అందరి మనస్సులో ఇదే అభిప్రాయం ఉంటుంది. నేను చెబుతున్నా వాళ్ళు చెప్పడం లేదు. జబర్దస్త్ కమెడియన్స్ లో ఎవరైనా వాళ్ళ తల్లి, పిల్లలపై ప్రమాణం చేసి నేను చెప్పింది అబద్ధమని చెప్పమనండి అంటూ ఆర్పీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

PREV
16
అంతా చేయిస్తుంది నాగబాబే!... మల్లెమాలపై ఆయన పగ ఇంకా చల్లారలేదా?
Nagababu

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డికి వ్యాపారమే ముఖ్యం. కమర్షియల్ గా ఆలోచిస్తారు. వ్యవహారం ఏదైనా నీకెంత నాకెంత అని ఆలోచిస్తారు. మల్లెమాల పద్ధతులు నచ్చకే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు అంటూ పలు ఆరోపణలు చేశారు. మల్లెమాలపై దాని అధినేతపై పలు ఆరోపణలు చేసిన కిరాక్ ఆర్పీ నాగబాబు(Nagababu) మాత్రం దేవుడంటూ కొనియాడడం విశేషం. 
 

26
Nagababu

కాగా కిరాక్ ఆర్పీ ఈ స్థాయిలో జబర్దస్త్ మేకర్స్ పై ఆరోపణలు చేయడానికి నాగబాబే కారణమన్న మాట వినిపిస్తుంది. కిరాక్ ఆర్పీ చేత ఉద్దేశపూర్వకంగానే నాగబాబు మాట్లాడించారన్న వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో మల్లెమాలపై నాగబాబు అక్కసు ఇంకా తీర లేదని అర్థమవుతుంది. జబర్దస్త్ క్రెడిబిలిటీ దెబ్బతీసి తన జడ్జిగా ఉన్న షోస్ కి ఆదరణ రాబట్టాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కొందరు వాపోతున్నారు.

36


2013లో జబర్దస్త్(Jabardasth) మొదలు కాగా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న నాగబాబు జడ్జిగా మారాడు. ఏళ్ల తరబడి ఆ షో జడ్జిగా వ్యవహరించి అప్పుల నుండి బయటపడ్డారు. ఏ విషయాన్ని నాగబాబు స్వయంగా వెల్లడించారు. 2019లో షోని వీడిన నాగబాబు మల్లెమాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కిరాక్ ఆర్పీ మాదిరి, ఆహారం, పారితోషికం సరిగా ఉండవని విమర్శలు చేశారు. 

46
Niharika Konidela

మల్లెమాల నాకు ఎంత సహాయం చేసిందో అదే స్థాయిలో నా వలన షోకి ఆదరణ దక్కిందంటూ నాగబాబు సమర్ధించుకున్నారు. జబర్దస్త్ షోలో తనకు అత్యంత అనుకూలురైన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ(Kirak RP)తో పాటు డైరెక్టర్స్ ని నాగబాబు తనతో పాటు తీసుకుపోయారు. జబర్దస్త్ కి పోటీగా అదిరింది పేరుతో జీ తెలుగులో ఓ కామెడీ స్టార్ట్ చేసి బొక్కబోర్లా పడ్డారు.

56
Nagababu


ప్రస్తుతం నాగబాబు స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కి వెళ్లారు. ఆ షోలో దాదాపు జబర్దస్త్ ఓల్డ్ కమెడియన్స్ పని చేస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి స్టార్స్ వెళ్లిపోయారు. జబర్దస్త్ ని దెబ్బతీయడానికి ఇదే సరైన సమయమని నాగబాబు ప్రణాళికలు వేస్తున్నారనిపిస్తుంది. 
 

66


కాగా కిరాక్ ఆర్పీ ఆరోపణలను హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఖండించడం జరిగింది. కిరాక్ ఆర్పీ మాటల్లో వాస్తవం లేదన్నారు. అతనెందుకు అలా చెబుతున్నారో తెలియదు, మల్లెమాల వాళ్ళు మంచిగానే ట్రీట్ చేస్తారు అన్నారు. ఇక సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సినిమాలలో బిజీ కావడం వలెనే జబర్దస్త్ నుండి వెళ్లిపోయారని వివరణ ఇచ్చాడు. 

click me!

Recommended Stories