మన తెలుగువాడే..
రాజ్ నిడిమోరు మన తెలుగు వ్యక్తే అని మీలో ఎంత మందికి తెలుసు. రాజ్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే కొన్నేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. అయితే ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో భారత్‌కు వచ్చిన రాజ్ నిడిమోరు స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్స్మ్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఇందులో భాగంగా మొదట షాదీ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు.
ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు సిరీస్‌లకు మంచి ఆదరణ లభించింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలోనే సమంతకు రాజ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో మొదలైన స్నేహమే ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. మరి సమంత నిజంగానే రాజ్ నిడిమోరుతో ఏడు అడుగులు నడవనుందా.? సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ చర్చలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అటు సమంత కానీ, ఇటు రాజ్ కానీ అధికారికంగా స్పందించాల్సిందే.