‘పుష్ఫ2’ నుంచి సమంతకు ఆఫర్? ఈసారి రిజెక్ట్ చేసిందంట.. రీజన్ ఏంటీ?

First Published | Feb 16, 2023, 1:57 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన కేరీర్ లో చేసిన ఒకే ఒక్క ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా ’. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాగా సీక్వెల్ లోనూ సమంతను అదే ఆఫర్ కోసం మేకర్స్ సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) చైతూతో విడిపోయే సమయంలో కాస్తా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప: ది రైజ్‌’తో కేరీర్ ను రీస్టార్ట్ చేశారు.  ఈచిత్రంలో సమంత స్పెషల్ నెంబర్ లో అలరించిన విషయం తెలిసిందే. 
 

సామ్ తన కేరీర్ లో చేసిన ఒకే ఒక్క ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా ’. 2021లో వచ్చిన ఈచిత్రంలో సమంత ఐటెం సాంగ్ లో నటించడం సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కానీ ఈపాటు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. సమంత గ్లామర్ స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. సమంత కేరీర్ కు మంచి పరిణామాలను తెచ్చిపెట్టింది.
 


దీంతో ‘పుష్ప2’లో సమంత కోసం దర్శకుడు సుకుమార్ ఓ ప్రత్యేకమైన రోల్ ను క్రియేట్ చేస్తున్నారని.. అది కథను మరో లెవల్ కు తీసుకెళ్తుందని అప్పట్లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రస్తుతం సినీ వర్గాల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుండటం విశేషం. 

‘పుష్ప2’ మేకరర్స్ సమంతకు సీక్వెల్ లోనూ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తనను మరోసారి స్పెషల్ నెంబర్ లో నటించేందుకు సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సామ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేయడంతో ప్రస్తుతం స్పెషల్ నెంబర్స్ లో నటించే ఛాన్స్ లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. 
 

ఈ సందర్భంగా మేకర్స్ కు సమంత నో చెప్పారని అంటున్నారు. ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు మాత్రం పుట్టుకొస్తున్నాయి. చూడాలి మరీ మున్ముందు ఏం జరుగుతుందనేది. ‘పుష్ప2’షూటింగ్ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలనే వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తైంది. ఇక ప్రస్తుతం సమంత క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. 
 

‘యశోద’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం ‘శాకుంతలం’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
 

Latest Videos

click me!