సలార్ 2 ఆగిపోయిందా? కెజిఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, మరి ఎన్టీఆర్ మూవీ?

First Published May 25, 2024, 1:53 PM IST

సలార్ 2 ఆగిపోయిందని వస్తున్న వార్తలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ సలార్ 2, కెజిఎఫ్ 3 చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు. 
 


2023 డిసెంబర్ 22న విడుదలైన సలార్ ప్రభాస్ కి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరుస ప్లాప్స్ సతమతం అవుతున్న ప్రభాస్ సలార్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు. ఫ్యాన్స్ కోరుకున్న విధంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. 
 

అయితే సలార్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచేలేదన్న వాదన ఉంది. దర్శకుడు అసలు కథ పార్ట్ 2 కోసం దాచేశాడు. సలార్ అసంతృప్తి పరిచిందని ఓ వర్గం విమర్శలు గుప్పించింది.అలాగే సలార్ వసూళ్లు ఫేక్ అని కథనాలు వెలువడ్డాయి. కొన్ని ఏరియాల్లో సలార్ నష్టాలు మిగిల్చింది. 

ఈ క్రమంలో సలార్ 2 ఉండకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. సలార్ 2 ప్రాజెక్ట్ పక్కన పెట్టేసిన ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడనే వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మేకర్స్ కి సలార్ 2 పట్ల ఆసక్తి లేని క్రమంలో ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్లే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. 

సలార్ 2 కి చరమగీతం పాడిన ప్రశాంత్... ఎన్టీఆర్ చిత్రాన్ని ఆగస్టు నుండి స్టార్ట్ చేస్తాడట. ఈ వార్త శౌర్యంగపర్వం ఏమిటో తెలుసునే ఛాన్స్ పోయిందని బాధపడుతున్నారు. సలార్ 2 ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. 
 

Salaar 2

త్వరలో సలార్ 2 పట్టాలెక్కుతోంది. కెజిఎఫ్ నుండి బయటకు రావడానికి నాకు కొంత సమయం పట్టింది. బ్రేక్ తీసుకుని సలార్ చేశాను. ఇప్పుడు కూడా కొంత విరామం తీసుకోవాలి. అలాగే కెజిఎఫ్ 3 కూడా ఉంటుంది. స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. అయితే యష్ పలు కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. కెజిఎఫ్ 3 కి సమయం పడుతుంది. సలార్ 2 కచ్చితంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ అన్నారు. 

కాగా ప్రభాస్ కల్కి 2829 AD  విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 27న విడుదల కానుంది. అలాగే రాజా సాబ్ చిత్రీకరణ జరుగుతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో  మూవీకి కమిట్ అయ్యాడు. మరి ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్టీఆర్, ప్రభాస్ లలో ఎవరితో ముందు సినిమా చేస్తాడనే సందేహం కొనసాగుతుంది. 

click me!