‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ మార్చబోతున్నారా? ఆ బ్లాక్ బాస్టర్ డేట్ ను ఫిక్స్ చేస్తారా!

First Published | Jul 24, 2023, 3:42 PM IST

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రిలీజ్ డేట్ ను మేకర్స్ వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇలా ఉన్నాయి. 
 

Project K చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’గా టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్  చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.  ‘మహానటి’ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నారు. దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 

రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో కాస్తా విమర్శలు అందుకుంది. వీఎఫ్ఎక్స్ బాగాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ వెంటనే అమెరికాలోని కామిక్ కాన్ శాన్ డియాగో ఈవెంట్ లో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ తో టాక్ మారిపోయింది. నెగిటెవిటీ పోయి భారీ అంచనాలు పెరిగాయి. 
 


గ్లింప్స్ తో నాగ్ అశ్విన్ విమర్శలకు అడ్డుకట్ట వేశారు. హాలీవుడ్ తరహాలో టేకింగ్ ఉంటుందనిపించారు. అందుకు తగ్గట్టుగానే గ్రాండ్ వీఎఫ్ఎక్స్ ను వాడుతున్నట్టు గ్లింప్స్ తో తేల్చారు. ప్రస్తుతం కల్కిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు విుదల కాబోతుందని ఎదురుచూస్తున్నారు. 
 

అయితే, ఇప్పటికే మేకర్స్ Kalki 2898 AD మూవీ విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సినిమాను మరో నాలుగు నెలలకు పోస్ట్ పోన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

జనవరిలో కాకుండా మే9న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారంట. వైజయంతి బ్యానర్ లో ఆ డేట్ న విడుదలైన చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. పైగా Nag Ashwin దర్శకత్వంలోనే వచ్చిన ‘మహానటి’ కూడా అదే డేట్ కు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతంలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కూడా వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. 
 

పైగా మే9న గురువారం కావడంతో వీకెండ్ కలిసివస్తోందని మేకర్స్ భావిస్తున్నారంట. పైగా సమ్మర్ కూడా కావడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద హెల్ప్ కానుందని ఆలోచిస్తున్నారంట. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

Latest Videos

click me!