అప్సరస లాంటి అందాలతో హోయలు పోయిన కాజల్‌.. రాజహంసలా ముస్తాబై విరహపు పోజులు.. సెగలు రేపుతుందిగా!

Published : Jul 24, 2023, 03:41 PM IST

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత చాలా హాట్‌గా తయారైంది. అంతేకాదు సెకండ్‌ ఇన్నింగ్స్ లో మరింత జోరుపెంచుతుంది. వెండితెరపై రఫ్ఫాడించేందుకు వస్తుంది.   

PREV
17
అప్సరస లాంటి అందాలతో హోయలు పోయిన కాజల్‌.. రాజహంసలా ముస్తాబై విరహపు పోజులు.. సెగలు రేపుతుందిగా!

కాజల్‌ అగర్వాల్‌ క్లీన్‌ ఇమేజ్‌తో టాలీవుడ్‌ని దాదాపు రెండు దశాబ్దాలపాటు శాసించింది. ఇంకా రాణిస్తుంది. ఇంతటి సుధీర్ఘ కెరీర్‌ మెయింటేన్‌ చేయడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో కాజల్‌ది అరుదైన రికార్డ్ గానే చెప్పాలి. కమర్షియల్‌గా హీరోయిన్ గా నిలచిన కాజల్‌ గ్లామర్‌ షో విషయంలో ముందే ఉంది. 

27

వెండితెరపై అందాల విందు చేసిన ఈ భామ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దానికి మించి చేస్తుంది. ఇటీవల కాలంలో ఆమె మోడల్‌గా మారి ప్రముఖ బ్రాండ్‌ డిజైనర్‌ వేర్స్ ని ప్రదర్శిస్తుంది. తాజాగా కాజల్‌ ఓ కొత్త బ్రాండ్‌కి అంబాసిడర్‌గా చేసింది. ఇందులో రాజహంసలా ముస్తాబై హోయలు పోయింది. 
 

37

ఈ నయా అందాల విందు మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది. అప్సరసలా అందాల విందు చేస్తూ విరహ వేదన చెందుతుంది. వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లి మతిపోగొడుతుందీ టాలీవుడ్‌ చందమామ. కాజల్‌ లేటెస్ట్ ఫోటో సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఆమె ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది. 
 

47

కాజల్‌ హీరోయిన్‌గా ఇప్పుడు బిజీ అవుతుంది. అయితే ఇటీవల కాజల్‌ కుమారుడికి జన్మనిచ్చింది. తాను తల్లి అయిన తర్వాత కూడా తన పూర్వపు ఫిట్‌నెస్‌ని పొందింది. అందుకు చాలా శ్రమించింది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ నాజూకు అందాలను తిరిగి పొందింది. అయితే ఇప్పుడు ఆమె మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే హాట్‌గా తయారైంది. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

57

కాజల్‌ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన హీరోయిన్‌. తనని తాను షైన్‌ చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేకర్స్ కి సపోర్ట్ చేయడంతో దర్శక, నిర్మాతలు, హీరోలు కాజల్‌ని ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. వివాదాలకు దూరంగా ఉండింది కాజల్‌. అదే ఆమెని స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. దాన్ని అలానే నిలబెట్టుకునేలా చేసింది. కాజల్‌ సక్సెస్‌ కూడా అదే. 

67

తన ప్రేమ విషయాలను కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది. సైలెంట్‌గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి తనని ఆరాధించే అభిమానుల గుండెల్లో బాంబులు పేల్చింది. ముంబయికి చెందిన వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020లో మ్యారేజ్‌ జరిగింది. గతేడాది ఏప్రిల్‌లో కుమారుడు నీల్‌ కిచ్లు జన్మించారు. 

77
Kajal Aggarwal

ఇప్పుడు తిరిగి పూర్వపు ఫిట్‌నెస్‌ పొంది, మళ్లీ సినిమాలు చేస్తుంది. ఇటీవల `సత్యభామ` సినిమాని  ప్రకటించిన విషయం తెలిసిందే. కాజల్‌ చేస్తున్న తొలి ప్రాపర్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. దీంతోపాటు మరో రెండు మహిళా ప్రధాన చిత్రాలు చేస్తుందట. మరోవైపు బాలకృష్ణతో తొలిసారి `భగవంత్‌ కేసరి`లో నటిస్తుంది.  ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుందీ అందాల భామ.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories