దిల్ రాజు ‘లవ్ మీ’ మూవీ రివ్యూ

First Published | May 25, 2024, 2:18 PM IST

‘లవ్ మీ’ ఓ దయ్యం గురించి తెలుసుకోవటం  కోసం,   హీరో పాత్ర చేసిన రీసెర్చ్ ,జర్నీ ఏంటి? ఆ దయ్యానికి హీరో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేదే కథ.

Love Me If You Dare


మనుష్యులను ప్రేమించటం కష్టంగా ఉంది.. కాంపిటేషన్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి దెయ్యాలతో అయితే ఆ సమస్యలు ఏమీ రావు అని అనకున్నారేమో దెయ్యంతో ప్రేమ కథను  వండి వడ్డించారు. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు చెందిన బ్యానర్ లో వచ్చిన సినిమా కావటంతో సహజంగానే ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఈ దెయ్యం లవ్ స్టోరీ ఎలా ఉంది, చూడదగ్గ సినిమాయేనా, కేవలం దెయ్యంతో ప్రేమేనా లేక వేరే వ్యవహారాలు కూడా ఉన్నాయా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Love Me If You Dare

స్టోరీ లైన్

అర్జున్(ఆశిష్ రెడ్డి) ఎవరైనా ఏదైనా వద్దంటే వెంటనే వెళ్లి చేసే రకం. అతను తన సోదుడు ప్రతాప్(రవికృష్ణ) తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూంటారు. ఈ క్రమంలో మూఢనమ్మకాలు ఛేధిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో పెడుతూంటారు.  వాళ్ల ఛానెల్‌లోనే కంటెంట్ హెడ్‌గా పని చేస్తుంటుంది ప్రియ (వైష్ణవి చైతన్య). ప్రియ కేవలం హెడ్ మాత్రమే కాదు ప్రతాప్ గాళ్ ఫ్రెండ్.    ఈ క్రమంలో వాళ్లకో విషయం తెలుస్తుంది.

తమ ఊళ్లో మిస్ అయిన దివ్యవతి (సంయుక్త మీనన్)   తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని తెలుస్తుంది. ఆమె దెయ్యంగా మారిందని, ఆ బంగ్లాకు వెళ్లినవాళ్లను చంపేస్తుందని ప్రచారం. దాంతో  దివ్యవతి విషయం తేలుద్దామని   ఆ అపార్ట్మెంట్ కి వెళతాడు. ఆమె కనుక దెయ్యంలా ఉంటే ప్రేమిస్తానని కూడా చెప్తాడు. అలా వెళ్ళిన అర్జున్ కు  దివ్యవతి గురించి ఏం తెలిసింది? ఆమెతో అర్జున్ ప్రేమలో పడ్డాడా...అసలు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..అసలు నిజం ఏమిటి వంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.  


Love Me If You Dare

ఎలా ఉంది
 

#LoveMe స్టోరీ కోర్ ఐడియాగా ఇంట్రస్ట్ గా అనిపించేదే. అయితే అదే సమయంలో సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే దెయ్యంతో లవ్ స్టోరీ అనగానే మన పెదాలపై ఓ  చిరు నవ్వు వస్తుంది. దాంతో అల్లరి నరేష్ లాంటి నటుడు కామెడీ చెయ్యాల్సిన పాయింట్ కదా అనిపిస్తుంది. దాంతో మొదట డైరక్టర్ కు పెద్ద టాస్క్ ఇది  కామెడీ సినిమా కాదు సీరియస్  లవ్ స్టోరీ అని ఒప్పించాలి.  అందుకోసం హీరో ని సీరియస్ గా చూపెడితే సరిపోతుంది అనుకున్నారు. ఇక ఆ ఐడియా  కథ గా విస్తరించే క్రమంలో అసలు ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా...దెయ్యంతో ప్రేమలో పడాల్సిన సిట్యువేషన్ ఎందుకు హీరోకు వచ్చింది... అనేదాన్ని కన్వెన్సింగ్ లాజికల్ గా చెప్పాలి. అదే సమయంలో మనస్సుకు హత్తుకునేలా చెప్పాలి. హత్తుకునేలా అనేది చిన్న పదమే కానీ దాన్ని సరితూగే సీన్స్ వేయటం మాత్రం భారీ ప్రయత్నమే ఎప్పుడూ.  
 

Love Me If You Dare


 ఎమోషన్ ఉండాలి కానీ అది అతి అయితే తట్టుకోలేరు. చాలా బ్యాలెన్స్ గా నడపాలి. డైరక్టర్ అక్కడ ప్లాట్ గా సీన్స్ రాసేసి ఆ కాసేపు మసిపూసి మారేడు కాయ చందాన ముందుకు వెళ్లిపోదామనుకున్నాడు. కానీ జనాలకు అదే కావాలి. ఏదైమైనా దెయ్యంతో లవ్ స్టోరీ తీయటం అంత ఈజీ అయితే కాదు అని చెప్పటానికి తీసినట్లున్నాయి సీన్స్. అది పూర్తిగా స్క్రీన్ ప్లే సమస్యే.అక్కడక్కడా సస్పెన్స్ ని క్రియేట్ చేయగలిగారు కానీ ఓవరాల్ గా కన్ఫూజ్ చేసారు. ఫస్టాఫ్ ని సబ్జెక్టు లో ఉన్న ఇంటెన్స్ ఎలిమెంట్ తో లాగేసారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథలో పట్టుతప్పి పూర్తిగా తేలిపోయింది. ప్లాష్ బ్యాక్ దాటాక సెకండాఫ్ లో వచ్చే సీన్స్ బాగా  నెమ్మదిస్తాయి. హీరో చేసే పనులన్నీ  రిపీట్ గా అనిపిస్తాయి. అందులో భయపెట్టే ఎలిమెంట్ హైలెట్ కాలేదు లవ్ స్టోరీ ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఏదైమైనా హీరో క్యారక్టర్ కు ఏం చేస్తున్నామో..ఏం చేయాలో క్లారిటీ ఉంటే చూసేవారికి క్లారిటీ వస్తుంది. అదే లోపించింది.

Love Me If You Dare


టెక్నికల్:

పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారంటే ప్రత్యేకంగా కెమెరా వర్క్ బాగుంది అని చెప్పాలంటే నవ్వుతారు.  కాబట్టి ఎప్పటిలాగే ఓ మాట చెప్పుకోవాలి. సినిమాలో  లొకేషన్స్ అన్ని న్యాచురల్ గా తెరకెక్కించారు. కథకు తగ్గ డార్క్ మూడ్ ఫెరఫెక్ట్ . హంగు ఆర్భాటాలు కనిపించవు. అలాగే కీరవాణి సంగీతం గొప్పగానే అనిపించింది కానీ ఈ సినిమాకు సెట్ కాలేదు అనుకోవాలి. ఎందుకంటే ఏ పాట పెద్ద గొప్పగా లేదు. ఇంక ఈ టాప్ టెక్నీషియన్స్ ఇద్దరూ ఉండి దిల్ రాజు నిర్మాణం తమ ఇంటి హీరో అయినప్పుడు సినిమా రిచ్ నెస్ కు లోటేముంటుంది. ఎడిటర్ మాత్రం సెకండాఫ్ ని బాగా ట్రిమ్ చేసి ఉంటే జనం ఆనందపడుదురు. మిగతా డిపార్టమెంట్స్ సినిమాకు తగ్గట్లు అవుట్ ఫుట్ ఇచ్చాయి. ఆర్ట్ వర్క్ మిగతా డిపార్మమెంట్స్ తో పోటీ పడింది. అయితే ఎన్ని చెప్పుకున్నా డైరక్టర్ ఈ సినిమాని అనుకున్న స్దాయిలో కథను తెరపై తీసుకురాలేకపోవటంతో ఏ డిపార్టమెంట్ గుర్తు ఉండదు.

Love Me If You Dare


ఎవరెలా చేసారు

అర్జున్ గా ఆశిష్ ఎప్పూడూ మూడీగా సీరియస్ గా ఉంటూ రక్తికట్టించాడు. రెండో సినిమా అయినా కంఫర్ట్ గా ఇబ్బంది లేకుండా ఇబ్బంది అనిపించకుండా చేసాడు.  హీరోయిజం ఓవర్ గా ఎలివేట్ చేయకుండా న్యాచురల్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవటం కలిసొచ్చింది. బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఫెరపెక్ట్ ఛాయిస్. తన పాత్రకి తాను న్యాయం చేకూర్చింది. మోడ్రన్ గా కనిపించి మెప్పించింది. మిగతా పాత్రలకి చెప్పుకోదగ్గ  స్కోప్ లేదు.  
  
 

Love Me If You Dare

ప్లస్ పాయింట్స్

 ఆర్ట్ వర్క్
విజువల్స్  
 ప్రొడక్షన్ వాల్యూస్


మైనస్ పాయింట్స్

కన్ఫూజ్ గా సాగే కథ,కథనం
బలం లేని సన్నివేశాలు 
ఇబ్బందిపెట్టే పాటలు, 
 

Love Me If You Dare

ఫైనల్ థాట్

 ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా దెయ్యాలు,వాటితో ప్రేమ గోల ఏమిటని తేలిగ్గా తీసిపారేయొచ్చు. కానీ నమ్మిస్తేనే కదా డైరక్టర్ సక్సెస్ అయ్యినట్లు.ఆ నేర్పు దర్శకుడిలో వుంటే ఆ పాయింట్ ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబడుతుంది.  డైరక్టర్ ఈ విషయంలో కథకు కావాల్సిన నేర్పుని కనబరిచలేకపోయాడనే చెప్పాలి.
 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

Love Me If You Dare

 నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి, సంయుక్త మీనన్ తదితరులు

సంగీతం: ఎంఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్

ఎడిటర్: సంతోష్ కామిరెడ్డి

నిర్మాతలు: హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ భీమవరపు

Latest Videos

click me!