Devara : ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా? రెండు కారణాలు... అదేం లేదంటూ టీమ్ క్లారిటీ!

First Published | Jan 21, 2024, 9:05 PM IST

ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలోని ‘దేవర’ Devara రిలీజ్ వాయిదా పడిందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై యూనిట్ స్పందించింది. పలు కారణాలతో పోస్ట్ పోన్ అంటుండటంపై క్లారిటీ ఇచ్చారు. 

Devara Relase Date

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ Jr NTR  ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ Devara లో నటిస్తున్నారు. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఇదొకటి. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Devara Relase Date

ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ Koratala Siva  దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను కూడా టీమ్ విడుదల చేస్తూనే వస్తోంది.


Devara Relase Date

రీసెంట్ గానే Devara Glimpse కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంతో ప్రేక్షకులకు విజువల్స్ ను కూడా గ్రాండ్ గా చూపించబోతున్నారు. దీంతో వీఎఫ్ఎక్స్ కు ఇంకాస్తా సమయం పడనుందంటున్నారు. 

Devara Relase Date

మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతుండటంతో ఈ సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ రెండు కారణాలు ప్రధానంగా చెబుతూ ‘దేవర’ పోస్ట్ పోన్డ్ అన్నారు. 

అయితే, దీనిపై ఇటీవల టీమ్ స్పందించింది. ‘దేవర’ రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్లను ఖండించారు. నిన్న సాయంత్రం క్లారిటీ ఇచ్చారు. 2024 ఏప్రిల్ 5నే రానుందని అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో ప్రకటించింది. 

Devara Relase Date

దీంతో రిలీజ్ విషయంలో వచ్చిన రూమర్లన్నింటికీ అడ్డుకట్ట పడింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor)   కథనాయికగా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.  

Latest Videos

click me!