విష్ణు-మనోజ్ వివాదానికి తెర... కొడుకులకు ఆస్తులు పంచేసిన మోహన్ బాబు?

First Published | Jul 14, 2023, 10:54 AM IST


నటుడు మోహన్ బాబు షాద్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కనిపించడం కొత్త అనుమానాలకు దారి తీసింది. మోహన్ బాబు ఆస్తి పంపకాల కోసమే అక్కడకు వచ్చారని ప్రచారం జరుగుతుంది. 
 


నటుడు మోహన్ బాబు కుమారులు విష్ణు-మనోజ్ మధ్య సఖ్యత లేదు. కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఏడాది కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలంటూ కథనాలు వెలువడుతున్నాయి. మనోజ్-మౌనికల వివాహంతో దీనిపై స్పష్టత వచ్చింది. మనోజ్ పెళ్ళికి విష్ణు రాలేదు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో హాజరయ్యారు. 


పెళ్ళైన కొద్దిరోజులకు మనోజ్ సంచలన వీడియో షేర్ చేశాడు. విష్ణు తన వాళ్ళ మీద దాడి చేస్తున్నాడని ఆ వీడియోలో మనోజ్ ఆరోపణలు చేశాడు. మనోజ్ ఫేస్బుక్ స్టేటస్ లో షేర్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదంతా నిజం కాదు రియాలిటీ షోలో భాగమని విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. 
 


అనూహ్యంగా అక్క మంచు లక్ష్మి కూడా విష్ణుకు దూరంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవలకు ఆస్తి పంపకాలు కూడా కారణమే ఓ వాదన ఉంది. ఆల్రెడీ కొన్ని ఆస్తులు మోహన్ బాబు పంచేశారట. మోహన్ బాబు కుటుంబానికి ప్రధాన ఆదాయవనరుగా శ్రీవిద్యా నికేతన్ ఉంది. దాని బాధ్యతలు విష్ణుకు అప్పగించారు.

ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇంటిని మంచు లక్ష్మికి రాశారట. హైదరాబాద్ శివారులో ఉన్న కొన్ని ఆస్తులు మనోజ్ కి ఇచ్చాడని సమాచారం. ఇంకా కొన్ని ఆస్తులు పంచాల్సి ఉండగా అవి కూడా పిల్లలకు సమానం పంచేశాడనే పుకారు తెరపైకి వచ్చింది. జులై 13న మోహన్ బాబు షాద్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని చుట్టుముట్టారు. 
 

రిజిస్టర్ ఆఫీస్ కి ఎందుకు వచ్చారని వివరణ అడిగే  ప్రయత్నం చేయగా మోహన్ బాబు మండిపడ్డారు. మైకులు లాక్కోండి అంటూ అసిస్టెంట్స్ కి చెప్పారు. ఉద్యోగాలు ఊడగొడతా పక్కకు పోండని అసహనం వ్యక్తం చేశారు. షాద్ నగర్ ఏరియాలో మోహన్ బాబుకు ఆస్తులు ఉండగా అవి పిల్లల పేరున రాసేందుకు మోహన్ బాబు వచ్చారని ప్రచారం జరుగుతుంది.

ఆస్తుల విషయంలో విష్ణు-మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా మోహన్ బాబు ఉన్నవి పంచేసి వివాదాలు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కాగా మార్చి 3న మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి అక్క మంచు లక్ష్మి అన్నీ తానై వ్యవహరించారు. 
 

Latest Videos

click me!