NTR - Rajamouli
రాజమౌళికి, ఎన్టీఆర్ కు ఉన్న స్నేహం తెలిసిందే. ఎన్టీఆర్ గతంలో చాలా సార్లు ఆ విషయం ప్రస్తావించారు. రాజమౌళి తనకు స్నేహితుడు మాత్రమే కాదు జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని అన్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. కెరీర్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో, సాధారణంగా ఉన్న తన జీవితాన్ని ఇంతలా మార్చింది ఆయనే అని ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ నిజంగానే ప్రతీ విషయంలోనూ రాజమౌళి జడ్జిమెంట్ ని నమ్ముతారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి.
NTR - Rajamouli
రాజమౌళి మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటించాడు. అలాగే ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని రాజమౌళి చెప్పాడు. ఎన్టీఆర్ కళ్లతో కూడా నటించగలడని ప్రశంసించాడు.
ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటామని రాజమౌళి తెలిపాడు.అలాగే ఎన్టీఆర్ ప్రతీ కీలకమైన విషయంలోనూ రాజమౌళి సలహా తీసుకుంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు దేవర ప్రమోషన్స్ విషయోలనూ రాజమౌళి డైరక్షన్ లో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
NTR - Rajamouli
ఇప్పుడు ఎక్కడ విన్నా ‘దేవర’కబుర్లే. గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ (#NTR) పేరు వరుసగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా ‘దేవర’లోని పాట విడుదలైన దగ్గర నుంచి రోజూ ఎన్టీఆర్ పేరు టాప్‌లో కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ షేర్ చేయటం, ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం ముంబయి వెళ్లడం, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాను కలవడం.. ఇలాంటి విశేషాలతో నేడు యంగ్ టైగర్ (NTR) పేరు మీద పోస్ట్‌లు తెగ షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో విషయం బయిటకు వచ్చింది. అదే ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఎన్టీఆర్ అనుసరిస్తున్న స్ట్రాటజీ....
దేవర చిత్రం నిమిత్తం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ముంబైలో ఈ రోజు జరగనుంది. ఈ ఈవెంట్ కు సినిమాకు చేసిన మేజర్ కాస్ట్ అండ్ క్రూ అంతా పాల్గొంటారు. ముఖ్యంగా జాహ్నవి కపూర్, సైఫ్ అలి ఖాన్ ఈ ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా మార్చనున్నారని తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్ కన్నా ముందే ఎన్టీఆర్ ముంబై వెళ్లారు ప్రమోషన్స్ కోసం. అక్కడ పేరు పొందిన మీడియా హౌస్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. తమ దేవర చిత్రం రీచ్ భారీగా ఉండలనే రీతిలో అక్కడ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ తెర తీసారు.
ఎన్టీఆర్ మరికొద్ది రోజులు ముంబైలోనే ఉండి మీడియా హౌస్ లకు ఇంటర్వూలు ఇస్తారు. అలాగే కమిల్ శర్మ షోకు షూటింగ్ కంప్లీట్ చేసారు. సందీప్ వంగాతో ఇంటర్వూ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా హిందీ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు ఎన్టీఆర్. దేవర సినిమా ఇంపాక్ట్ తన తదుపరి చిత్రం వార్ 2 మీద ఉంటుందని భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన ఇమేజ్ ని ఈ సినిమాతో రెట్టింపు చేయాలనేదే ఎన్టీఆర్ స్ట్రాటజీగా చెప్తున్నారు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
NTR - Rajamouli
అయితే తెలుగు లో కొందరికి నచ్చటం లేదు. ఎన్టీఆర్ .. దేవర తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఒక ఇంటర్వ్యూ కానీ, ఒక ప్రెస్ మీట్ కానీ ఏది ఇంకా స్టార్ట్ చేయలేదు.. ఇవాళ రిలీజ్ కాబోయే ట్రైలర్ లాంచ్ కూడా ముంబైలోనే జరగబోతుంది. ఎన్టీఆర్.. ఎందుకు ఇలా చేస్తున్నాడు..? హిందీలో తన మార్కెట్ ను పెంచుకోవడానికి చేస్తున్నాడా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఏదైమైనా ఈ రోజు వచ్చే ట్రయిలర్ అదిరిపోతుందని అంటున్నారు. రెండు నిమిషాల 50 సెకెండ్ల ట్రయిలర్ ను దర్శకుడు కొరటాల శివ కట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రయిలర్ ను ముంబాయిలో మీడియా ముందు విడుదల చేసి ఒక్కసారిగా నార్త్ బెల్ట్ దృష్టి తమ సినిమాపై పడేలా చేయాలనేది వారి ఆలోచన.
దేవర సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారనేది నిజం. అందుకోసమే మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నా, సైఫ్ ని విలన్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఆలోచన అదే.
rrr movie first review,
అలాగే దర్శకుడు సందీప్ వంగా హీరో ఎన్టీఆర్ ను ఇంటర్వూ చేయబోతున్నారు. ఇది కచ్చితంగా వైరల్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే సందీప్ వంగా కు వున్న క్రేజ్ అలాంటిది.ఇంకా చెప్పాలంటే దేవర ఒక తెలుగు సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూండటంతో ఈ ప్రమోషన్స్ తప్పవు. ఖచ్చితంగా చేయాల్సిందే. దేవర టాలీవుడ్ సినిమా కాబట్టి.. ఇక్కడ మనవాళ్ళందరి అటెన్షన్ ఎలాగో ఉంటుంది. రాజమౌళి గతంలో చేసింది ఇదే. ఆయన సలహాలు, సూచనలతో ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తోంది ఇదే.