#NTRNEEL ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే? , నిజమైతే కేకే

First Published May 17, 2024, 8:22 AM IST

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న అనౌన్స్ చేస్తారని సమాచారం.

NTR, PRASANTH NEEL


ఇవాళ స్టార్ హీరోల ప్యాన్ ఇండియా సినిమాలకు టైటిల్స్ పెట్టడం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఆ టైటిల్ కేవలం ఒక్క భాషవాళ్లు యాక్సెప్ట్ చేస్తే సరిపోదు. అన్ని భాషలవాళ్లు పలికేలా ఉండాలి. వాళ్లకు అర్దం కావాలి.  తెలుగులో సినిమా తీస్తున్నాం కదా అని ఇక్కడ నేటివిటి  టైటిల్ పెట్టే రోజులు అయితే వెళ్లిపోయాయి. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తున్నారనే వార్త బయిటకు వచ్చింది. దాంతో ఆ టైటిల్ ఏంటనేది హాట్ టాపిగ్ గా మారింది. 

ntr, prasanth neel


 ఎన్టీఆర్‌ (NTR)తో తాను తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని గతంలో ప్రశాంత్ నీల్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే టైటిల్ నుంచి అన్నీ విభిన్నంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కానీ, ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేందుకు నిరాకరించారు. ప్రేక్షకులు యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని, జానర్‌ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Latest Videos



ఈ సంవత్సరం  ద్వితీయార్థంలో ఈ చిత్రం  చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న అనౌన్స్ చేస్తారని సమాచారం. 


ఒకవేళ టైటిల్ ‘డ్రాగన్’ అయితే అదిరిపోయే పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక KGF, సలార్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. 
 


ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న సమయంలోనే తన నెక్స్ట్ సినిమా జూ.ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.  అయితే  ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా గురించి ఓ విషయం బయటపెట్టాడు.
 


ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు చేయని పాత్రను, కథను సినిమా చేయబోతున్నాను. యంగ్ ఎన్టీఆర్ కూడా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నాడు. ఈ కథ నా మామూలు స్టైల్‌లో ఉండదు, దానికి బదులుగా సినిమాలో ఎమోషన్‌ ప్రధాన అంశంగా ఉంటుంది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం నీల్ ఒక సాలిడ్ యాక్షన్ మూవీని రెడీ చేస్తాడని అభిమానులు అంటున్నారు. అయితే నీల్ యాక్షన్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు


ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే పని మొదలుపెట్టాను. అయితే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ఓ హిందీలో వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాకు సరైన టైం కోసం వేచి చూడాల్సివస్తోంది. దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడలేను, నా దృష్టి అంతా ‘సలార్’ సినిమా  పైనే అని అన్నాడు.
 


 జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
 

 ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలతో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘన విజయాల తర్వాత దర్శకత్వం వహించిన సినిమాకావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లోనే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారాయన. #NTR31, #NTRNEEL అనేవి వర్కింగ్‌ టైటిల్స్‌గా ఉన్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ (Devara)తో బిజీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!