ఐబొమ్మ రవి పేరుతో ఓ ఎక్స్ ఖాతా నుంచి ఊహించని ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతని టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాలీవుడ్ మొత్తాన్ని ఐబొమ్మ రవి ఒక కుదుపు కుదిపేశాడు. విదేశాల్లో ఉంటూ సినిమా పైరసీ చేస్తూ కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నాడు. చాలా కాలం పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రవి ఎట్టకేలకు కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో తమ వద్ద ఎవరి ఆటలు సాగవు అని హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు.
25
బెయిల్ పై బయటకు
అయితే రవి చివరికి బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే మళ్ళీ రవి యాక్టివ్ అయ్యాడా అనే ప్రచారం మొదలైంది. మునుపటిలా సినిమాలు పైరసీ చేయడం లేదు కానీ ఐబొమ్మ రవి పేరుతో సోషల్ మీడియాలో ఒక ఖాతా యాక్టివ్ గా ఉంది. అది ఫేక్ అకౌంటా ? లేక రవినే యాక్టివ్ అయ్యాడా అనేది క్లారిటీ లేదు.
35
వరుసగా ట్వీట్లు పోస్ట్
కానీ ఆ ఎక్స్ ఖాతా నుంచి మాత్రం వరుసగా ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించిన గాసిప్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రవి పేరు, ఫోటో తో ఉన్న ఆ అకౌంట్ ని దాదాపు 6 వేలమంది ఫాలో అవుతున్నారు.
ఈ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఈ ట్వీట్ లో టాలీవుడ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ని టార్గెట్ చేశారు. ఆయన ఫోటో, ఆయన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫోటో పెట్టు కన్నీళ్లు కారుస్తున్న ఎమోజి పెట్టారు. దీనికింద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కథ ముగిసినట్లేనా అని అంటున్నారు.
55
విజయాల శాతం చాలా తక్కువ
పీపుల్ మీడియా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి విజయాల శాతం చాలా తక్కువ. టిజి విశ్వప్రసాద్ గారికి హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి. చివరగా నిర్మించిన రాజా సాబ్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. మరికొందరు నెటిజన్లు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని విశ్వప్రసాద్ ఫిలిం ఇండస్ట్రీలో తగలేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.