త్వరలో హైపర్ ఆది పెళ్లి? ఆమెతో ప్రేమలో పడ్డ ‘జబర్దస్త్’ నటుడు!

First Published | Jul 30, 2023, 2:56 PM IST

బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ యాంకర్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఇక పెళ్లికి సిద్ధమయ్యారని అంటున్నారు. 

‘జబర్దస్త్’ షోతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు హైపర్ ఆది (Hyper Aadi).  ఆయన ఎంట్రీతోనే అదిరిపోయే పంచులతో బుల్లితెరపై సెన్సేషన్ గా మారారు. జబర్దస్ అంటే హైపర్ ఆది అనేలా చేశారు. 

అలాగే ‘ఢీ’ షోలోనూ దుమ్ములేపుతున్నారు. మరోవైపు  ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలోనూ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నారు. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా అటు వెండితెరపైనా కమెడియన్ గా అలరిస్తున్నారు. 


స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు సినిమాలకు రచన సహకారం చేస్తున్నారు. డైలాగ్స్  రాస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే.. కొద్ది కాలంగా బుల్లితెర స్టార్స్ ఓ ఇంటివారవుతున్న విషయం తెలిసిందే. కిర్రాక్ ఆర్పీ, జబర్దస్త్ రాకేష్, కెవ్వు కార్తీక్, యాదమ్మ రాజు వంటి వారు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో హైపర్ అది గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. 
 

స్టార్ కమెడియన్ హైపర్ ఆది త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కుచెందిన యాంకర్ తో ప్రేమలో ఉన్నారని అంటున్నారు. కొన్నేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతుందని  టాక్ వినిపిస్తోంది.
 

అయితే, ఆది ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి వచ్చిన కొత్తలో ఆమెనే అన్నివిధాలుగా సహకరించిందని, కాస్తా సపోర్ట్ గా నిలిచిందని అంటున్నారు. దాంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని అంటున్నారు. వీరి ప్రేమను ఇంట్లో వారూ అంగీకరించాని తెలుస్తోంది. త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉందంటున్నారు. దీనిపై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేదు. 

Latest Videos

click me!