విలాసవంతమైన ఇళ్లు.. లగ్జరీ కార్లు.. హీరోయిన్ తమన్నా ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

Published : Jul 30, 2023, 02:09 PM IST

హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది తమన్నా. మిల్క్ బ్యూటీగా స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కోట్లలో ఆస్తులు వెనకేసినట్టు తెలుస్తోంది. 

PREV
17
విలాసవంతమైన ఇళ్లు.. లగ్జరీ కార్లు.. హీరోయిన్ తమన్నా ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. మిల్కీ బ్యూటీగా తమన్నా భాటియా ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా కూడా.. ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ కూడా మెయింటేన్ చేస్తూ.. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. 

27

రీసెంట్ గా బాలీవుడ్ లో విడుద‌లైన జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ యాక్టింగ్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ త‌మ‌న్నా.. త్వ‌ర‌లోనే రెండు సినిమాల‌తో ఆడియన్స్ నుఅలరిస్తోంది.టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన `భోళా శంక‌ర్‌`తో పాటు.. తమిళ సూపర్ స్టార్  ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. 
 

37

ఈ రెండు సినిమాలు ఆగ‌స్టు లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.  జైల‌ర్ సినిమా ఆగ‌స్టు 10న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న రిలీజ్ కాబోతుంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ తమన్నా కోట్లలో సంపాదించినట్టు తెలుస్తోంది. త‌మ‌న్నా పేరిన కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. తమ్మూ బేబీ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందట. 

47

దాదాపు 17 ఏళ్ల నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా  కొనసాగుతోంది తమన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తోంది బ్యూటీ..  గ‌ట్టిగానే సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకు తమన్నా 3 నుంచి 4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందట. వీటితో పాటు కమర్షియల్ ఆడ్స్ కూడా చేస్తూ.. పలు ప్రాడక్స్స్క కు  బ్రాండ్ గా  వ్య‌వ‌హ‌రిస్తోంది.
 

57
tamanna bhatia

అంతే కాదు ఇటు సినిమాలు.. అటుయాడ్స్ తో పాటు...  మ‌రోవైపు బిజినెస్ రంగంలోకూడా అడుగు పెట్టింది బ్యూటీ.  2015లో ఆమె వైట్ & గోల్డ్ పేరుతో జ్యూవ్వెలరీ బిజినెస్ ను స్టార్ట్ చేసింది మిల్క్ బ్యూటీ.  ఈ బిజినెస్ లో మిల్కీ బ్యూటీ సూప‌ర్ స‌క్సెస్ అయింది.

67

ఇక త‌మ‌న్నా ఏడాదికి 15 కోట్ల‌కు పైగా సంపాదిస్తుంద‌ట‌. సంపాద‌న విష‌యంలో స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ లేదట బ్యూటీ. త‌మ‌న్నా ఆస్తుల విలువ మొత్తంగా 120 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె సొంతం. లక్జరీ కార్లు, ఇళ్ల కూడా ఉన్నాయట తమ్ముకీ. 

77

ముంబైలోని వెర్సోవాలో 16 కోట్లు విలువ చేసే విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ త‌మ‌న్నాకు ఉంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డ‌బ్లూ 5 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ల‌గ్జ‌రీ కార్లు త‌మ‌న్నా గ్యారేజ్ లో ఉన్నాయి.మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుందీ న్యూస్. 

click me!

Recommended Stories