లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) - తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో 1996లో ‘భారతీయుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ ఫిల్మ్ గా అలరిచింది. అప్పట్లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక రెండు దశాబ్దాల అనంతరం సీక్వెల్ ను ప్రకటించారు. ఆ తర్వాతి రెండేళ్లకు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు నిరాశే ఎదురైంది. కోవిడ్ కారణంగా, సెట్స్ లో కొందరు చనిపోవడం, మరిన్ని అంశాల్లో లీగల్ ఇష్యూలనూ ఎదుర్కోవడంతో.. సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేళలకు గతేడాది ఆగస్టులో షూటింగ్ పున:ప్రారంభించారు. అప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో Game Changer ను కూడా పట్టాలెక్కించడంతో రెండు చిత్రాలను పార్లల్ గా షూట్ చేస్తూ వచ్చారు. ఇలా ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేక మరింత ఆలస్యం అయ్యింది. ఏట్టకేళలకు ప్రస్తుతం Indian 2 షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. కానీ అంతలోనే మరో న్యూస్ వినిపిస్తోంది.
‘ఇండియన్ 2’ రిలీజ్ విషయంలో శంకర్ అండ్ టీమ్ డైలమాలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకు శంకర్ షూట్ చేసిన ఫుటేజీ, రఫ్ అంతా మూడు గంటలకు మించిందంట. మరోవైపు ఏకంగా ఆరు గంటల వరకు రన్ టైమ్ వచ్చిందని అంటున్నారు.
దీంతో మేకర్స్ దాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇండియన్ 2నే కాకుండా ఇండియన్ 3 కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే, కమల్ హాసన్ మాత్రం దానికి సుముఖంగా లేరంట. ఎడిట్ చేసి ఇండియన్ 2గానే వెళ్దామనే సూచించారంట. మొదట అలాగే అనుకున్నా.. తర్వాత మాత్రం మేకర్స్ రెండు భాగాలుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మేకర్స్, శంకర్ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనే ఉన్నారని స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ కాజల్ అగర్వాల, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ నటిస్తుండటంతో టూ పార్ట్ గా వెళ్లాలని చూస్తున్నారంట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉందని తెలుస్తోంది.
ఇండియన్ 2 వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఇండియన్ 3 అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ముత్తురాజ్ ఆర్ట్ డైరెక్షన్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు.