యాంకర్ ప్రదీప్ పెళ్లి సెట్ అయ్యినట్లే .. పెళ్లి కూతురు ఎవరంటే?

First Published | Dec 20, 2022, 3:22 PM IST

యాంకర్‌ ప్రదీప్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి నిజంగానే ప్రదీప్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. తాజాగా పెళ్లి కూతురి డిటేయిల్స్ కూడా వైరల్ అవతున్నాయి. 

తెలుగు  నెంబర్ వన్ యాంకర్లలో ప్రదీప్‌ మాచిరాజు కూడా ఒకరనే సంగతి తెలిసిందే.  చిన్నతెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్‌ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్  బాగా నచ్చుతుందని అభిమానులు చెప్తూంటారు. తనకు ఉన్న క్రేజ్ తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు.

ఇదిలా ఉండగా కొంతకాలంగా యాంకర్‌ ప్రదీప్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన , పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి నిజంగానే ప్రదీప్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.


తాజాగా ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయటం మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని  వినిపిస్తోంది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ వివాహం కోసం ఇరువురు తమ కుటుంబాలతో చర్చించి ఓ  నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇరువురి మతాలు వేరైనప్పటికీ పెద్దలు వీరి పెళ్లికి పెద్ద మనస్సుతో ఒప్పుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఇరువురి కుటుంబాలు కూడా ఎప్పటి నుంచో స్నేహితులు కావడం ప్లస్ అయ్యిందంటున్నారు. 

ప్రదీప్  తన పెళ్లి గురించి  రియాక్ట్ అయ్యాడు. ప్రదీప్ ను మీకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉందా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఉందా అని ప్రశ్నించగా ప్రదీప్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం వచ్చింది. దీనికి  సమాధానంగా తనకు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు ఇష్టమో కూడా  చెప్పాడు. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే చివరికి పెద్దలను ఒప్పించాలి కాబట్టి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ను చేసుకుంటా అని స్పష్టం చేసాడు.

గతంలో ప్రదీప్ ని మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. ప్రదీప్  30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేసాక ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. గతంలో భం బోళేనాథ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, జులాయి, 100% లవ్, వరుడు లాంటి సినిమాల్లో ప్రదీప్ కనిపించాడు.
 

Latest Videos

click me!