30 ఏళ్ల రజినీకాంత్ సినిమా.. రీ రిలీజ్ కాబోతోంది..? తలైవా ఫ్యాన్స్ కు పండగే..

Published : Jan 17, 2025, 03:19 PM IST

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 30 ఏళ్లక్రితం రిలీజ్ అయ్యి.. సంచలనంగా మారిన ఈసినిమాను మరోసారి థియేటర్లో చూడబోతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ఆ సినిమా ఏంటి..? 

PREV
16
30 ఏళ్ల రజినీకాంత్ సినిమా.. రీ రిలీజ్ కాబోతోంది..? తలైవా ఫ్యాన్స్ కు పండగే..
Actor Rajinikanth starrer Baashha

రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు సౌత్ భాషల్లో అన్నింటిలో తలైవాను ఎలా ఆరాధిస్తారో అందరికి తెలుసు. ఈక్రమంలో రజినీకాంత్ నుంచి ప్లాప్ సినిమా వచ్చినా సరే దాన్ని ఆధరిస్తుంటారు. 73 ఏళ్ల వయస్సులో కూడా రజినీకాంత్ తన అభిమానులను అలరిస్తూ.. కష్టపడుతున్నారు. 

26

ఈక్రమంలో రజినీకాంత్  నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని థియేటర్ లో చూడలేదు అనే లోటు ఉండేది..ఈ కాలం అభిమానులకు. దాంతో అలాంటి వారికి సంతోషం కలిగించే వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న రీరిలీజ్ ఫార్ములాను వాడుకుని.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ ఓల్డ్ మూవీస్ ను మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రజినీకాంత్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఒకటి రీరిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

36

రజినీకాంత్ సినిమాల్లో ఎవగ్రీన్ హిట్ సినిమా  బాషా. ఈసినిమాను ఎన్నిసార్లు చూసినా.. బోర్ కొట్టదు. అద్భుతమైన ఈసినిమాను ఈతరం ప్రేక్షకులు థియేటర్లో చూడలేకపోయారు. ఆ ఆశతీరడం కోసం  రజనీకాంత్ ఆల్ టైమ్ హిట్ సినిమా భాషాను రీరిలీజ్ చేయబోతున్నారట. ఈసినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. బాషా విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 

46

బాషా మళ్లీ థియేటర్లలోకి రానుందనే వార్త అభిమానుల్లో కొత్త చర్చగా మారింది. అంతే కాదు ఈసినిమాను రీమాస్టర్ చేయనున్నారు. ఈ చిత్రం 4K క్వాలిటీతో డాల్బీ అట్మాస్‌లో వస్తుంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్ జతగా ఈసినిమాలో  నగ్మా నటించగా.. రఘువరన్, జనగారాజు, దేవన్, శశికుమార్, విజయకుమార్, ఆనందరాజ్, చరణ్ రాజ్, కిట్టి, సత్యప్రియ, యువరాణి, అల్ఫోన్సా, హేమలత, దళపతి దినేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. 

56

ఇక ఈమూవీ రీరిలీజ్ ఎప్పుడు చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. కాని ఈ వార్త ప్రేక్షకులను సంతోషపెట్టింది. వెట్టయన్ రజనీకాంత్ నటించిన చివరి తమిళ చిత్రం. తమిళనాడు నుంచి వెట్టయన్ 200 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. వెట్టయన్‌కి యూఏ సర్టిఫికెట్‌ వచ్చింది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్‌ కతీర్‌. 

66
baasha

రజనీకాంత్, ఫహద్ ఫాజిల్‌తో పాటు మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, శర్వానంద్, జిషు సేన్‌గుప్తా, అభిరామి, మెథోడికా సింగ్, దుషార విజయన్, రామయ్య సుబ్రమణియన్, కిషోర్, రెడ్డిన్ కింగ్స్లీ, రోహిణి, రవి మారియా, రావు రమేష్, రాఘవ్ జుయల్, రమేష్ జుయల్, తిలక్, షాజీ చెన్, రఖాన్, సింగంపులి, జీఎం సుందర్, సాబుమోన్ అబ్దుసమద్, షబీర్ కల్లారకల్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories