‘బోయపాటిరాపో’లో స్పెషల్ సాంగ్ కు ఊర్వశీ రౌటేలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అన్ని కోట్లా?

First Published | May 24, 2023, 7:17 PM IST

బాలీవుడ్ యంగ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) ‘బోయపాటిరాపో’లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది. 
 

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా నెమ్మదిగా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. స్పెషల్ అపియరెన్స్ లో నటిస్తూ తెలుగు ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.
 

హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ వస్తున్న ఊర్వశీ ఇక టాలీవుడ్ లోనూ బిజీఅవుతోంది. స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన విషయం తెలిసిందే. 
 


ఆ తర్వాత అఖిల్ ‘ఏజెంట్’లోనూ స్పెషల్ సాంగ్ లోనూ అదిరిపోయేలా డాన్స్ వేసింది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - రామ్ పోతినేని (Ram Pothineni)  కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
 

రామ్ పోతినేని సరసన ఊర్వశీ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ ఒక్క సాంగ్ కోసమే ఊర్వశీ ఏకంగా రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మేకర్స్ కూడా అందుకు సిద్ధమే అన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికాకర ప్రకటన ఏదీ లేదు.
 

అయితే, మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన సమయంలోనే రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేసిందంటూ ప్రచారం జరిగింది. అయితే రెండు సాంగ్స్ చేసిందో లేదో తన రెమ్యూనరేషన్ ను పెంచిందనే వార్తలతో అందరూ షాక్ అవుతున్నారు. 

ఇక BoyapatiRapo   కాంబోతొలిసారి సెట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రామ్ పోతినేని కూడా ఊరమాస్ లుక్ లో అదరగొట్టబోతున్నట్టు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తో తెలుస్తోంది. యాక్షన్ పరంగా, డైలాగ్స్ పరంగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. 
 

Latest Videos

click me!