స్లీవ్ లెస్ టాప్ లో లావణ్య త్రిపాఠి మెరుపులు.. బ్యూటీఫుల్ సెల్ఫీలతో కట్టిపడేస్తున్న అందాల రాక్షసి

First Published | May 24, 2023, 5:49 PM IST

బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  ప్రస్తుతం ట్రావెలింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. 
 

యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ‘అందాల రాక్షసి’ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. 
 

అయితే, లావణ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనూ అభిమానులనూ పలకరిస్తూ ఉంటుంది. ఇటీవల మరింత యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.
 


లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ట్రావెలింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అభిమానుల లైక్స్,, కామెంట్లతో ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. లేటెస్ట్ పిక్స్ లో లావణ్య చాలా క్యాజువల్ గా మెరిసింది.

ఏదో ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ టాప్, లూస్ హెయిర్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ గా సెల్ఫీలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. మెరిసిపోయే రూపసౌందర్యం, మత్తెక్కించే చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. 

మరోవైపు రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనే లావణ్య వివాహం జరగబోతుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. గతం నుంచి ఈ న్యూస్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మున్ముందు వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కేరీర్ పరంగా చూస్తే.. పెద్దగా జోరు కనిపించడం లేదు. కానీ ఓ ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ పై సైన్ చేస్తూనే ఉంది. గతేడాది ‘హ్యాపీ బర్త్ డే’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్నేండ్లుగా తెలుగులోనే నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పు తమిళంలోనూ మెరిస్తోంది. ప్రస్తుతం ‘థనల్’ చిత్రంలో నటిస్తోంది.

Latest Videos

click me!