అరియానా ట్రెడిషనల్ అందాలకు కుర్రాళ్ల గోల.. నాట్య మయూరిలా ఆకట్టుకుంటున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Feb 27, 2023, 1:15 PM IST

‘బిగ్ బాస్’ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) గ్లామర్ విందులో అదరగొడుతోంది. ప్రస్తుతం బుల్లితెరపై తెగ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. రోజుకో తీరుగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. 
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతో  టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది అరియానా గ్లోరీ. సీజన్ 4 5తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. 
 

అలాగే బిగ్ బాస్ కు సంబంధించిన ‘బీబీ కెఫే’తోనూ అలరించింది. ప్రస్తుతం ‘బీబీ జోడీ’ (BB Jodi) రియాలిటీ డాన్స్ షో ద్వారా ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై అదిరిపోయే డాన్స్ తో పాటు మతిపోయే అందాలను ఆరబోస్తోంది. 
 


తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన లుక్ ను అభిమానులతో పంచుకుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. నాట్య మయూరిలా మైమరిపిస్తోంది. నడుము అందాలు, నాభీ సొగసుతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వ్యక్తిగత విషయాలనూ ఎప్పుటికప్పుడూ  తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా తాజాగా పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ కట్టిపడేస్తోంది. అలాగే తన డాన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. పెర్ఫామెన్స్ అదరగొట్టేందుకు రిహార్సల్స్ చేస్తూ బాగానే  కష్టపడుతుంది. 
 

ఈ సందర్భంగా ఫ్యాన్స్ లైక్స్ కామెంట్లతో అరియానా అందాన్ని పొగిడేస్తున్నారు. వరుసగా అందాలతో అదిరిపోయే ట్రీట్ అందిస్తుండటంతో ఖుషీ అవుతున్నారు. మరోవైపు తనను కావాల్సినంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. అరియానా సైతం అందం డోస్ పెంచుతూ ఆకట్టుకుంటోంది. 
 

యాంకర్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇలా బుల్లితెరపై సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ అందంతో కట్టిపడేస్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 
 

Latest Videos

click me!