Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే

Published : Aug 24, 2026, 11:46 AM IST

రవితేజ మొత్తానికి హిట్‌ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఏకంగా లాభాల్లోకి వెళ్తుంది. మరి తొలి వీకెండ్‌లో ఇది ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.

PREV
14
ఇరుముడి మూవీకి విశేష ఆదరణ

మాస్‌ మహారాజా రవితేజకు చాలా రోజుల తర్వాత హిట్‌ పడింది. `ఇరుముడి` మూవీతో బాక్సాఫీసుని షేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇందులో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయికుమార్‌, అజయ్‌ ఘోష్‌, స్వసిక విజయ్‌, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ హిట్‌ టాక్‌ ని తెచ్చుకుంది. అయ్యప్పస్వామికి సంబంధించిన ఎలిమెంట్లు, పాప సెంటిమెంట్ మేళవించిన మూవీ కావడంతో ఆడియెన్స్ కి బాగా కానెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా నచ్చుతోంది. వారు మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సినిమాకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి.

24
ఇరుముడి మూవీ కలెక్షన్లు

`ఇరుముడి` మూవీ జోరు చూస్తుంటే.. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా నిలవబోతుందని అర్థమవుతుంది. ఇప్పటికే ఇది ఏకంగా రూ.80కోట్లు సాధించడం విశేషం. సాక్నిల్క్ సైట్‌ లెక్కల ప్రకారం ఇది మూడు రోజుల్లో రూ.72.15కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఇండియాలో రూ.19కోట్లు రాబట్టింది. శనివారంతో పోల్చితే శుక్రవారం వసూళ్లు పెరగడం విశేషం. ఇండియాలో మూడు రోజుల్లో రూ.58.65కోట్ల గ్రాస్‌, రూ.50.50కోట్ల నెట్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో మూడో రోజు రూ.3.50కోట్లు కలెక్ట్ చేయగా, మొత్తంగా అక్కడ రూ.13.50కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో వంద కోట్లు దాటి.. రెండు వందల కోట్ల వైపు వెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

34
రెండో రోజుల్లోనే ఇరుముడి బ్రేక్‌ ఈవెన్‌

`ఇరుముడి` మూవీకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు అని సమాచారం. ఇక థియేట్రికల్‌ బిజినెస్‌ దాదాపు రూ.20కోట్లు అయ్యిందట. నైజాం రూ.5.50కోట్లకు, సీడెడ్‌ రూ.2.25కోట్లకు, ఆంధ్రా రూ.8.25కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌లో రెండు కోట్లకు, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రెండు కోట్లకు సేల్‌ చేశారట. దీంతో ఈ సినిమా హిట్‌ కావాలంటే రూ.21కోట్ల షేర్‌ రావాలి. అంటే సుమారు నలభై కోట్ల గ్రాస్‌ రావాలి. ఈ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇప్పుడు నిర్మాతలకు, బయ్యర్లకి లాభాల పంట పండిస్తోంది.

44
ఇరుముడి కథ ఇదే

ఇరుముడి సినిమాలో త్రినాథ్‌గా కనిపించారు రవితేజ. ఆయన అరటితోట సాగు చేస్తుంటాడు. లేక లేక కూతురు పుడుతుంది. ఆమెకి మణికంఠ అనే పేరు పెట్టుకున్నారు. ఆ ఊర్లో అమ్మాయిలపై కొందరి దుండగుల కన్నుపడుతుది. చదువుకోసం వేరే ఊరు వెళ్లి వస్తున్న అమ్మాయిలను వేధిస్తుంటారు. దీనికితోడు మణికంఠ చదువుకునే స్కూల్‌ టీచర్‌ కూడా స్పెషల్‌ క్లాస్‌ల పేరుతో ఇబ్బంది పెడుతుంది. రోజు రోజు జరిగింది జరిగినట్టు చెప్పే కూతురు.. తండ్రికి ఏం చెప్పింది? అమ్మాయిలను కాపాడేందుకు రవితేజ ఏం చేశాడనేది కథ. చాలా ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌తో మూవీ సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయ్యప్పస్వామికి సంబంధించిన సీన్లు, పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అవే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories