Irumudi Day 2 Collections: మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తరువాత ఓ భారీ సక్సెస్ తో జోష్ మీద ఉన్నాడు. ఇరుముడి సినిమా ఫస్ట్ డే కంటే కూడా రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'ఇరుముడి' థియేటర్లలో తన సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్‌గా రూ. 15.30 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం, రెండో రోజు (శనివారం) మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సక్సెస్ ఫుల్ బిజినెస్ ట్రాకర్ 'శాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం.. 'ఇరుముడి' సినిమా రెండో రోజు ఇండియాలో సుమారు రూ. 16.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
దేశవ్యాప్తంగా మొత్తం 2,943 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం, మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు ఏకంగా 5.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. శుక్రవారం నాడు ఈ చిత్రం మొత్తం 76.9 శాతం ఆక్యుపెన్సీని సాధించగా, శనివారం నాటికి 75.8 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.
24
ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి కలెక్షన్లు..?
తాజాగా నమోదైన రెండు రోజుల బాక్సాఫీస్ సంఖ్యలతో 'ఇరుముడి' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 31.40 కోట్లకు చేరాయి. దేశీయంగా ఈ సినిమా మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్ ప్రస్తుతం రూ. 36.45 కోట్లుగా ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సుమారు రూ. 5 కోట్లు వసూలు చేయడంతో, ఇప్పటివరకు మూవీ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ రూ. 11 కోట్లకు చేరింది. డొమెస్టిక్, ఓవర్సీస్ కలెక్షన్లను రెండింటినీ కలిపి చూస్తే, 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 47.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
34
తెలుగు వెర్షన్‌లోనే ఇరుముడి మూవీకి అత్యధిక వసూళ్లు
రెండో రోజు ఇరుముడి బాక్సాఫీస్ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ అత్యధిక వాటాను అందించింది. శనివారం తెలుగు వెర్షన్‌లో మొత్తం ఆక్యుపెన్సీ 78.54 శాతంగా నమోదైంది. మార్నింగ్ షోలలో 63 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలకు వచ్చేసరికి 80 శాతానికి పెరిగింది. ఈవెనింగ్ షోలలో 82.85 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, నైట్ షోలలో అత్యధికంగా 88.31 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. తమిళ వెర్షన్‌లో ఈ చిత్రం 15 శాతం మొత్తంగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలదే అగ్రస్థానం
రెండో రోజు 'ఇరుముడి' చిత్రం భారతదేశంలో మొత్తం రూ. 18.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యధిక సహకారాన్ని అందిస్తూ రూ. 15.75 కోట్లను రాబట్టాయి. ఇతర రాష్ట్రాల వివరాలు పరిశీలిస్తే, కర్ణాటక నుండి రూ. 2 కోట్ల గ్రాస్, తమిళనాడు నుండి రూ. 43 లక్షలు, కేరళ నుండి రూ. 2 లక్షలు రాగా, మిగిలిన భారతీయ ప్రాంతాల నుండి రూ. 50 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి.
ఎప్పుడూ మాస్ సినిమాలతో దుమ్మురేపే రవితేజ.. ఈసారి కాస్త ఎక్కువ సెంటిమెంట్ ఉన్న కథతో ముందుకెళ్లాడు. 'ఇరుముడి' సినిమా ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, వారి పెంపకంలో ఇద్దరు తండ్రులు అనుసరించే వేర్వేరు విధానాల నేపథ్యంతో తెరకెక్కింది. ఇందులో రవితేజ 'త్రినాథ్' అనే అయ్యప్ప భక్తుడి పాత్రలో నటించగా, ఆయన కుమార్తె 'మణికంఠ' పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. సాయి కుమార్ 'గోపాల్ రాజు' అనే పాత్రలో కనిపించి, తన కుమార్తె గాయత్రిని వేరే ఆలోచనా విధానంతో పెంచే తండ్రిగా అలరించారు. ఈసినిమా టాక్ బాగుంది అని తెలియడంతో.. థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్యామిలీ ఆడియన్స్ సంఖ్యం భారీగా పెరిగినట్టు సమాచారం.