మెగా పవర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ గా మారిన రామ్ చరణ్ లైనప్!

Published : Nov 06, 2022, 01:09 PM IST

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో నటిస్తుండగా.. తర్వాతి చిత్రంపై ఆసక్తి నెలకొంది. తాజాగా చరణ్ నెక్ట్స్ మూవీపై క్రేజీ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.  

PREV
16
మెగా పవర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ గా మారిన రామ్ చరణ్ లైనప్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం సౌత్ లో ప్రముఖ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దీంతో చరణ్ నెక్ట్స్ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్బంగా క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి.
 

26

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం  జపాన్ వెళ్లిన రామ్ చరణ్ అట్నుంచి టాంజానియాకు వెళ్లి స్మాల్ వేకేషన్ ను కూడా పూర్తి చేసుకొన్నారు. రెండ్రోజుల కిందనే ఇండియాకు తిరిగి వచ్చారు. దీంతో రామ్ చరణ్ నెక్ట్స్ మూవ్ ఏంటనేదని అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
 

36

ప్రస్తుతం రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి ఎలాంటి ఎగ్జైటింగ్ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం వేకేషన్ పూర్తి కావడంతో ఈ చిత్ర షూటింగ్ లోనే జాయిన్ కానున్నారు. మరికొద్ది రోజుల్లో ‘ఆర్సీ15’ పూర్తి కాబోతోంది. 

46

ఈ క్రమంలో చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.  ఇప్పటికే ‘ఆర్సీ16’ను ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరు డైరెక్ట్ చేయబోతున్నారని తొలుత ప్రకటించారు. చివరికి గౌతమ్ తప్పుకోవడంతో రీసెంట్ గా  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  తోనే అంటూ వార్తలు వచ్చాయి. 
 

56

తాజా సమాచారం ప్రకారం..  ‘ఆర్సీ16’ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్ట్ చేయబోతున్నాడని గట్టిగా ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబుతోనే నెక్ట్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు సుకుమార్ పేరు కూడా వినిపిస్తుండటంతో  తదుపరి చిత్రాలపైనా ఆసక్తి నెలకొంది.

66

‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం ‘ఆర్సీ15’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం, ‘ఆర్సీ16’పైనా సరైన క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే చెర్రీ ఇచ్చే అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి.

click me!

Recommended Stories