గత వారం ఎలిమినేటైన సూర్య సీక్రెట్ రూమ్ లో ఉన్నాడా? ఇనయా కోసం అతడు తిరిగి వచ్చాడా?... హోస్ట్ నాగార్జున బిగ్ ట్విస్ట్ తో ప్రేక్షకుల్లో ఉత్కంఠరేపారు. కంటెస్టెంట్స్ తో పాటు అందరూ షాక్ తిన్నారు.
బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఆడిందే ఆట పాడిందే పాట. అన్ని గేమ్స్ కి రూల్స్ ఉంటాయి. కానీ బిగ్ బాస్ షోకి ఎలాంటి నిబంధలు ఉండవు. షోని ఆసక్తికరంగా మలచడం కోసం బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. బిగ్ బాస్ ని ప్రశ్నించే అధికారం కంటెస్టెంట్స్ కి ఉండదు. కాగా గత వారం ఎలిమినేటైన సూర్య హౌస్లోకి తిరిగి వచ్చాడు అనిపిస్తుంది. లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమోలో దీనిపై హింట్ ఇచ్చాడు.
25
Bigg Boss Telugu 6
హోస్ట్ నాగార్జున దీనిపై హింట్ ఇచ్చాడు. ఇనయాతో నీ మనసులో ఉన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఎవరి కోసం ఎదురు చేస్తున్నావో నాకు తెలుసు. నీకోసం స్పెషల్ సర్ప్రైజ్ అంటూ... బిగ్ బాస్ ని సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు. నాగార్జున చెప్పింది సూర్య గురించే అని భావించిన ఇనయా సీక్రెట్ రూమ్ వైపు పరుగులు తీసింది. అతన్ని కలిసేందుకు ఆరాటపడింది. ఈ పరిణామానికి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందనే ఆలోచనలో పడ్డారు.
35
Bigg Boss Telugu 6
మరి సీక్రెట్ రూమ్ లో సూర్య ఉన్నాడా? అతడు ఇనయాను కలవబోతున్నాడా? లేక సూర్య దగ్గర్నుండి ఇనయా కోసం ఏదైనా గిఫ్ట్ వచ్చిందా? అనేది తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాలి. గత సీజన్స్ లో కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నట్లు ఇంటి సభ్యులను బ్రమకు గురి చేసి సీక్రెట్ రూమ్ కి పంపడం జరుగుతుంది. సూర్య ఎలిమినేషన్ రోజు అందరూ అదే అనుకున్నారు. సూర్య స్టేజ్ పైకి రావడంతో సీక్రెట్ రూమ్ కి సూర్యను పంపలేదు ఎలిమినేట్ చేశారనే నిర్ణయానికి వచ్చారు.
45
Bigg Boss Telugu 6
సూర్య బయటకు వచ్చిన మాట వాస్తవం. ఒకవేళ అతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో ఇనయా సూర్య ప్రేమ కోసం పరితపిస్తోంది. సూర్యను వెనక్కి తెస్తే మంచి స్పైసీ కంటెంట్ రాబట్ట వచ్చని ఆలోచన చేస్తూ ఉండవచ్చు. గతంలో ఇలా జరిగింది. ఎలిమినేటైన అలీ రెజాకు ఛాన్స్ ఇచ్చి మరలా హౌస్లోకి తెచ్చారు. గాయాలపాలైన నూతన్ నాయుడు ట్రీట్మెంట్ తర్వాత తిరిగి బిగ్ బాస్ హౌస్ కి రావడం జరిగింది.
55
Bigg Boss Telugu 6
కాబట్టి బిగ్ బాస్ సూర్యకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి గేమ్ ఆసక్తికరంగా మలుస్తాడేమో అనిపిస్తుంది. కాగా ఎలిమినేషన్ నుండి నిన్న ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్ సేవ్ అయ్యారు. ఇంకా ఆరుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.