ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న తెలుగు బ్యూటీ.. పద్ధతిగా మెరిసి మెస్మరైజ్ చేస్తున్న ఈషా రెబ్బా

First Published | Jul 31, 2023, 8:15 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)  మొన్నటి వరకు వెకేషన్ లో రచ్చ చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఇక తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. 
 

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. భారీ చిత్రాల్లో కాకపోయినా ద్వితీయ శ్రేణి హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాత్రం అలరించేందుకు ప్రయత్నిస్తోంది. 
 

పదేళ్లకు పైగా ఈషా రెబ్బా ఇండస్ట్రీలో ఉంటున్న విషయం తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మకు అప్పటి నుంచి సరైన అవకాశం అందలేదు. ఇప్పటికి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. కానీ చిన్న సినిమాలకే ఈ బ్యూటీ పరిమితం అవుతోంది. 


దీంతో నెమ్మదిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లోనూ మెరుస్తూ కట్టిపడేస్తోంది. 
 

మొన్నటి వరకు ఈషా రెబ్బా వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. బీచ్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి  అట్రాక్ట్ చేసింది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది. ఇక తాజాగా తెలుగు అందం ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. 
 

బ్లూ చుడీదార్ లో ఈషా రెబ్బా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. కొంటె చూపులు, చిరునవ్వుతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.  లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో చాలా బాగుంటావంటూ కామెంట్లు సైతం పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

సినిమాల విషయానికొస్తే.. తెలుగులో అప్పట్లో పెద్దగా ఫలితం లేకపోవడంతో తమిళం బాట పట్టింది. అక్కడా అమ్మడుకు అదృష్టం లేకపోవడంతో.. మళ్లీ తెలుగులోనే అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’, జేడీ చక్రవర్తి తో ‘దయా’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!