‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ట్రైలర్ డేట్.. సుహాస్ బర్త్ డే ట్రీట్.. రెజీనా ‘నేనేనా?’ రిలీజ్ డేట్ ఇదే..

First Published | Aug 19, 2023, 9:36 PM IST

వీకెండ్ సందర్భంగా టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ నుంచి అప్డేట్స్ అందాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, నేనేనా?, సుహాస్ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందించారు. 
 

Miss Shetty Mister Polishetty :  యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. వంశీ, ప్ర‌మోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్  అందాయి. సాంగ్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ ను రెడీ చేశారు. ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 
 

Nene Naa Movie :  2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా (Regina Cassandra) . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫ్యాన్ బేస్ నూ పెంచుకుంది. రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరును సాధించుకుంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘శాకినీ ఢాకినీ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతోంది. ఈరోజు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో "సూర్పనగై" అనే తమిళం సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికేట్ ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. 


Suhas Birthday : కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి హిట్ చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్ (Suhas). ఆయన హీరోగా నటిస్తున్న మరో సినిమా రాబోతోంది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ Ambajipeta marriage band అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్నిజీఏ2 పిక్చర్స్,  దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే శనివారం సుహాస్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. 

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్  కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సుహాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Soul of satya :  ‘బ్రో’ చిత్రంతో తేజూ రీసెంట్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ‘సోల్ ఆఫ్ సత్య’తో వచ్చారు. అయితే, సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)  కూడా ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష,  బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. 
తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు హీరో నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు. కలర్స్ స్వాతి ఫిమేల్ లీడ్ గా సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు. రీసెంట్ గా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి టీమ్ ను అభినందించారు

మ‌న కోసం దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌ను అర్పిస్తున్న సైనికుల‌కు, వారి వెనుకున్న ఎందరో త‌ల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళి గా.. మంచి కాన్సెప్ట్ తో ఈ  షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో సోల్జర్ గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాట పాడారు.
 

Mr.Pregnant Movie Success Meet  : 
దయచేసి రీరిలీజ్ లు శుక్రవారం కాకుండా మరోరోజు పెట్టుకోవాలని కోరుతున్నట్టు నిర్మాత అప్పిరెడ్డి అన్నారు. అయితే, Mr.Pregnant Movie సక్సెస్ మీట్ లో ఆయనతో పాటు సోహైల్, దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సయ్యద్ సోహైల్ రియాన్ (Sohel), రూపా కొడవాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించారు. నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషన్ ఎంటర్ ఫ్లస్ టైన్ మెంట్ కలిసి తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. 

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వస్తున్నరెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఈ సినిమాను కొంతమంది బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాతో చేస్తే నేషనల్ వైడ్ మంచి హిట్ అవుతుందని సజెస్ట్ చేశారు. కానీ సోహైల్ మన టాలీవుడ్ ఆయుశ్మాన్ ఖురానా అని భావించాం. బాగా పర్ ఫార్మ్ చేశారు. మా సినిమా చూసిన లేడీ ఆడియెన్స్ ఎమోషనల్ గా రివ్యూస్ ఇస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోలకు, ప్రొడ్యూసర్స్ కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న సినిమాలకు ఎప్పుడో ఒకసారి ఒక మంచి రిలీజ్ డేట్ దొరుకుతుంది. ఆ ఫ్రైడేనే పెద్ద హీరోల సినిమాలు, తమిళ హిట్ సినిమాల రీ రిలీజ్ లు చేస్తున్నారు. దయచేసి మీ రీ రిలీజ్ లు ఫ్రైడే కాకుండా మరో రోజు చూసి చేసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాను సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్.. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్స్ కు గట్స్ ఉండాలి. మైక్ మూవీస్ సంస్థ ఆ రిస్క్ తీసుకుంది. ఈ సినిమాను ఏ భాషలో రీమేక్ చేసినా మైక్ మూవీస్ మాత్రమే నిర్మించాలని కోరుకుంటున్నా. సినిమాకు నటీనటులు, టెక్నీషియన్లు బెస్ట్ అందించారు...... హీరో సోహైల్ మాట్లాడుతూ - నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. అన్నారు.

Latest Videos

click me!