సూర్య కిరణాలు టాప్‌ అందాలను ముద్దాడగా పరవశంతో అనుపమా తన్మయత్వం.. ఆ విరహ వేదన చూస్తే కుర్రాళ్ల మీటర్లు బ్రేకే

First Published | Aug 19, 2023, 7:55 PM IST

అనుపమా పరమేశ్వరన్‌.. కెరీర్‌లో ఓ కొత్త ఛాలెంజెస్‌ని స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. రెగ్యూలర్‌ హీరోయిన్ల పాత్రల కంటే భిన్నమైన, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతుంది. కొత్త పంథాని ఫాలో అవుతుంది. 
 

హోమ్లీ బ్యూటీగా ఉన్న అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. క్యూట్‌ అందాలతో మెరిసి మెప్పించిన ఈ భామ ఇప్పుడు బోల్డ్ కంటెంట్‌ ఉన్న చిత్రాల్లో భాగమవుతూ ఆశ్చర్యపరుస్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తూనే, కమర్షియల్‌ చిత్రాల్లోనూ భాగమవుతుంది. 
 

అంతకు ముందు క్యూట్‌ అందాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు బోల్డ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో ఫోటో షూట్లలో గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతుంది. హాట్‌గా అందాలను ఆవిష్కరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే పోజులిచ్చింది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 


అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా విండో వద్ద కూర్చొని కెమెరాకి పోజులిచ్చింది. ఇందులో సూర్య రశ్మీ అనుపమా అందాలను ముద్దాడగా దానికి పరవశించిపోతుంది ఈ అందాల భామ. విరహ వేదన చెందుతున్నట్టుగా ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె కురులతో మరింతగా టెంప్ట్ చేస్తుంది. 

దీనికి నెటిజన్లు స్పందిస్తూ విరహంతో టెంప్ట్ చేస్తున్న అనుపమా అని, ఇలా చూస్తే మీటర్లు పగిలిపోవాల్సిందే అంటున్నారు. అనుపమాలో మార్పు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు ఏమైనా చేసేలా చేస్తాయని అంటున్నారు. బోల్డ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా అనుపమా నయా హాట్‌ లుక్స్ తో కుర్రాళ్లని కట్టిపడేస్తుందని చెప్పొచ్చు.
 

అనుపమా పరమేశ్వరన్‌.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ దేనికదే భిన్నమైన మూవీ కావడం విశేషం. అందులో ఒకటి `టిల్లు స్వ్కైర్‌`. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న మూవీ ఇది. ఇందులో కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది అనుపమా. అంతేకాదు ఆమె లుక్స్, గెటప్‌ చాలా హాట్‌గా ఉండటం విశేషం. 
 

మరోవైపు రవితేజతో `ఈగల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు `సిరెన్‌` అనే ఓ సినిమా చేస్తుంది. అలాగే మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఇలా మూడు నాలుగు సినిమాలతో అనుపమా పరమేశ్వరన్‌ ఫుల్‌ బిజీగా ఉంది. 
 

ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో హోమ్లీ బ్యూటీగా మెరిసింది అనుపమా. తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. క్యూట్ గా ఆకట్టుకుంది. అలరించింది. కానీ `రౌడీ బాయ్స్` చిత్రంతో ఆమెలో చాలా మార్పు కనిపించింది. అందులో ఏకంగా లిప్‌ లాక్‌కే సిద్దపడింది. రొమాంటిక్‌ సీన్లలోనూ కనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని అలాంటి పాత్రల్లోనూ కనిపించబోతుండటం విశేషం. 
 

అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేస్తుంది అనుపమా. గతేడాది `బట్టర్ ఫ్లై` చిత్రంలో నటించి మెప్పించింది. తనే కథని నడపించింది. పోరాడింది. మంచి ప్రశంసలందుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా తాను చేయగలనని తెలిపింది. 
 

Latest Videos

click me!