‘హిట్ 3’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ముగ్గురు స్టార్లతో సాలిడ్ గానే ప్లాన్ చేస్తున్నారుగా!

Published : Nov 22, 2022, 01:37 PM IST

యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వంలో.. నేచురల్ స్టార్ నాని సమర్పణలో  ‘హిట్’ సీక్వెల్స్ మోస్ట్ అవైటెడ్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ‘హిట్ 2’ రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే.. ‘హిట్ 3’పైనా క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.  

PREV
16
‘హిట్ 3’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ముగ్గురు స్టార్లతో  సాలిడ్ గానే ప్లాన్ చేస్తున్నారుగా!

‘హిట్ : ది ఫస్ట్ కేస్’తో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను అసలైన యాక్షన్ థ్రిలర్ ను ప్రేక్షకులకు చూపించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మాత తిపిర్నేని ప్రశాంతి మరియు నేచురల్ స్టార్ నాని కలిసి నిర్మించారు. 2020లోనే వచ్చిన ఫస్ట్ కేస్ ఆడియెన్స్ ను మెప్పించింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది.
 

26

దీంతో ‘హిట్’ సీక్వెల్స్ ను కూడా ప్రకటించారు. మేకర్స్. వరుస కేసులను సాల్వ్ చేస్తూ ఆడియెన్స్ కు అసలైన థ్రిల్ ను అందిస్తామని ప్రామీస్ చేశారు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ వెర్స్’ (Hit Verse)ను కూడా పరిచయం చేశారు. హిట్ సీక్వెల్స్ మొత్తం 7 ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రపంచంలోకి వెళ్లే కొద్ది మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. 
 

36

అలాగే ఒక్కో దశలో ఒక్కో కేసును సాల్వ్ చేస్తూ వెళ్తుంటామని, ఈ క్రమంలో అందుకే మున్ముందు వచ్చే సీక్వెల్స్ లో లీడ్ రోల్ యాక్టర్స్ మారుతారని అన్నారు. ‘హిట్ వెర్స్’లో అవసరమైన చోట మళ్లీ వారు కలుస్తారని చెప్పారు. ప్రస్తుతం ‘హిట్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

46

Hit 2 ఇంకా ప్రేక్షకుల ముందుకు రానేలేదు. అప్పుడే ‘హిట్ 3’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఎప్పటి నుంచో ‘హిట్’ సిరీస్ లలో నాని నటిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ సీక్వెల్ లో కనిపిస్తారని కచ్చితంగా తెలియదు. దీనిపై తాజాగా అప్డేట్ అందింది.

56

‘హిట్ 3’లోనే నాని నటించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)  కూడా హిట్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. హిట్ 2కు.. హిట్ 3కి లింకు ఉంటుదని అందుకే అడివి శేషు (Adivi Sesh) పాత్ర కూడా కంటిన్యూ అవుతుందని అంటున్నారు. 
 

66

ఈ ట్రయో కాంబినేషన్ లో సాలిడ్ యాక్షన్ ను ప్లాన్ చేశారంట. క్రూషియల్ రోల్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘హిట్ 3’మొత్తం యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ప్రచారం. మరోవైపు ‘హిట్ 2’ చివరల్లోనే  ఈ క్రేజీ అప్డేట్ కు సంబంధించిన గ్లింప్స్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం డిసెంబర్ 2న రాబోతున్న హిట్ 2 కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. రేపు  సాలిడ్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories