
బిగ్ బాస్ తెలుగు 9 ఎనిమిదో వారంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చి నామినేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎపిసోడ్‌లో కూడా భరణి, శ్రష్టి వచ్చి నామినేట్ చేశారు. శ్రష్టి.. పవన్ ని నామినేట్ చేయగా, ఆమె మరో నామినేషన్ రాముకి ఇచ్చింది. అతను గౌరవ్‌ని నామినేట్ చేశాడు. ఇక భరణి.. సంజనాని నామినేట్ చేశాడు. బాడీ షేమింగ్ కామెంట్లని ప్రధానంగా ఆయన లేవనెత్తాడు. ఆ విషయంలో తాను సారీ చెప్పినట్టు తెలిపింది సంజనా, కానీ సారీ చెబితే సరిపోదంటూ ఫైర్ అయ్యాడు భరణి. మరో నామినేషన్ నిఖిల్‌కి ఇవ్వగా, అతను తనూజని నామినేట్ చేశారు. గేమ్ ఆడే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు గేమ్ ఆడటం లేదంటే, నువ్వు కనిపించడం లేదంటూ కామెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనూజ ఫైర్ అయ్యింది. నిఖిల్ ఇచ్చిన కౌంటర్లకి ఆమెకి కూడా ఫ్యూజులు ఔట్ అయ్యాయి. ఫస్ట్ టైమ్ నిఖిల్ ఇంత ఫైరింగ్‌లో కనిపించారు.
అనంతరం రీతూ, పవన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే విషయాన్ని పదే పదే రాద్ధాంతం చేస్తుందంటూ పవన్ అన్నాడు. ఆమె ఓ విషయం చెబుతుంటే, ఆయన వాదించాడు. దీంతో రీతూ సీరియస్ అయ్యింది. మరోవైపు తనూజ విషయంలో ఇమ్మాన్యుయెల్ గుసగుసలాడాడు. ఆమెకి వ్యతిరేకంగా గాసిప్‌లు నడిపించాడు. ఆమెపై క్రేజీ కామెంట్స్ చేశాడు. తనూజ మళ్ళీ భరణి రావాలని కోరుకుంటుంది. మరోవైపు దివ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి తనతో మాట్లాడలేదని వాపోయింది. ఇంతలోనే బిగ్ బాస్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇందులో శ్రీజ, భరణి మళ్లీ హౌజ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు హౌజ్‌లో ఉండే అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. అయితే వారు ఏం మిస్టేక్స్ చేశారు? ఏం సరిచేసుకోవాలి అనేది హౌజ్‌మేట్స్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరు ఎలిమినేషన్‌కి కారణాలను, మార్చుకోవాల్సిన విషయాలను వెల్లడించారు కంటెస్టెంట్లు.
మొదటగా దివ్య.. భరణిలో అతి మంచి ఉంటుందని, అదే మైనస్‌గా మారుతుందని, ఆ మంచి తనం వల్ల గేమ్‌లో వెనకబడిపోతున్నాడని తెలిపింది. మరీ మంచితనం పనికిరాదు అని చెప్పింది. దాన్ని భరణి అంగీకరించారు. ఇమ్మాన్యుయెల్.. శ్రీజకి సలహా ఇచ్చారు. వాదించే విషయంలో శ్రీజ గొడవని కంటిన్యూ చేస్తుందని, దాన్ని కట్ చేసుకోవాలని తెలిపాడు. అందుకు శ్రీజ ఓకే చెప్పింది. డీమాన్ పవన్.. భరణి నమ్మకం కోల్పోయాడు అని, మూడు సార్లు అలా జరిగిందని తెలిపాడు. నామినేషన్స్ లో అది జరిగిందని చెప్పగా, నమ్మాలా వద్దా అనేది నీ ఇష్టం అని భరణి చెప్పడం విశేషం. సంజనా కూడా భరణికి సలహా ఇచ్చింది. సాక్రిఫైజ్ చేయడానికి సంబంధించి పదే పదే ఆ పేరు వాడితే దానికి ఉన్న విలువ పడిపోతుందని తెలిపింది. సుమన్ శెట్టి సైతం భరణికి చెబుతూ, మీ గేమ్ మీరు ఆడాలని, ఇతర విషయాల కారణంగా మీ గేమ్ మీరు ఆడటం లేదని తెలిపారు.
గౌరవ్.. భరణికి చెబుతూ, ఫిజికల్ టాస్క్ లు బాగా ఆడాలని తెలిపారు. దివ్వెల మాధురి.. శ్రీజని నోరుని అదుపులో పెట్టుకోవాలని తెలిపింది. ఏదైనా విషయం పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని తెలిపింది. నీలా మాట్లాడటం రాదు అని, తాను బాగానే మాట్లాడతానని తెలిపింది శ్రీజ. మాధురీకి కౌంటర్ ఇచ్చింది. ఇందులో తనూజ, దివ్యలతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాలి. తన బాండింగ్‌ని వాడుకుని వాళ్లు ఎలివేట్ అయ్యారని, కానీ తనకు బొక్క పెట్టారని చెప్పారు. అవే పట్టుకుని తనని ఎలిమినేట్ చేశారని వెల్లడించారు. తనపై స్ట్రాటజీ వాడి పంపించారని తెలిపారు. భరణి కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక ఎనిమిదో వారం నామినేషన్ విషయానికి వస్తే ఈ వారం హౌజ్‌ని వీడేందుకు నామినేట్ అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో పవన్, తనూజ, కళ్యాణ్, రాము రాథోడ్, రీతూ చౌదరీ, సంజనా, దివ్వెల మాధురి, గౌరవ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.