చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..ఎప్పుడు, ఎక్కడంటే..

First Published | Aug 19, 2024, 12:43 PM IST

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు అయితే వచ్చింది కానీ సక్సెస్ దక్కడం లేదు. సక్సెస్ కోసం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు అయితే వచ్చింది కానీ సక్సెస్ దక్కడం లేదు. సక్సెస్ కోసం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ 'క' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలిపెట్టి కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజావారు రాణిగారు అనే చిత్రంతో కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే రియల్ లైఫ్ లో కిరణ్ అబ్బవరం తన జీవిత భాగస్వామి చేసుకోబోతున్నాడు. 


గత ఐదేళ్ల నుంచి రహస్యతో కిరణ్ అబ్బవరం రహస్య ప్రేమ సాగిస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఈ జంట తమ ప్రేమని బయట పెడుతూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య ల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. 

ఆగష్టు 22న వీరిద్దరి పెళ్ళికి ముహూర్తం కుదిరింది. కర్ణాటకలోని కూర్గ్ లో వీళ్లిద్దరి వివాహం జరగబోతోందట. చాలా సింపుల్ గా కిరణ్, రహస్య ల పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. రహస్య బంధువులంతా కూర్గ్ లోనే ఉండడంతో పెళ్లి అక్కడే జరగాలని నిర్ణయించారు. 

Latest Videos

click me!